అబ్బురపర్చిన బాడీబిల్డర్స్


Sun,February 17, 2019 03:25 AM

సిద్ధార్థనగర్, ఫిబ్రవరి 16: యువత చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ సీపీ రవీందర్ అన్నారు. హన్మకొండ వడ్డెపల్లిలోని శ్యామలాగార్డెన్‌లో వరంగల్ తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 150 మంది బాడీబిల్డర్లు హాజరై ఈపోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. నేటి యువత జీవితంలో స్థిరపడాలంటే చక్కటి ప్రణాళిక ఎంతో అవసరం అన్నారు. అనంతరం జిల్లాలో మొదటిసారిగా పోటీలు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈపోటీలు నిర్వహించడానికి కృషి చేసిన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్‌కుమార్ మాట్లాడారు ఈపోటీల్లో 55, 65,75 బరువు గల వారికి పదిరౌండ్ల చొప్పున పోటీలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఇందులో 2018-19 మిస్టర్ తెలంగాణ, మిస్టర్ వరంగల్ టైటిల్‌లో బాడీబిల్డర్స్ పోటీ పడి గె లుపొందారని ఆయన తెలిపారు.

గెలుపొందిన బిల్డర్లకు మొదటి బహుమతి మిస్టర్ తెలంగాణలో మొదటి బహుమతి టీవీఎస్ స్పోర్స్‌బైక్, 2వ బహుమతి 10,016, 3వ బహుమతి 5,016లను అందచేశారు. అదే మిస్టర్ వరంగల్‌లో మొదటి బహుమతి 10, 016, 2వ బహుమతి 5,016, 3వ బహుమతి రూ.3వేలు అందచేశారు. కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, సుబేదారి సీఐ సదయ్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రావు, జిల్లా చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌రాజ్, సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుమన్, యశ్వంత్, పీఆర్‌వో సునీల్, రాజేందర్, రాజ్‌కుమార్, చందర్, శేఖర్, రోహిత్, పాల్గొన్నారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...