మాస్టర్ ప్లాన్‌పై తుది కసరత్తు


Sun,February 17, 2019 03:24 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: వరంగల్ నగర ప్రగతి దిక్సూచి మాస్టర్‌ప్లాన్‌పై తుది కసరత్తు మొ దలైంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో శనివారం కుడా కార్యాలయంలో వైస్ చైర్మన్, కమిషనర్ రవికిరణ్‌తో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బం డా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశమయ్యారు. ముఖ్యంగా తూర్పు ని యోజకవర్గం పరిధిలో మాస్టర్‌ప్లాన్‌పై వారు సమీ క్ష జరిపారు . సుమారు 5 గంటల పాటు సుధీర్ఘంగా మాస్టర్‌ప్లాన్ త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపనున్న తరుణంలో వారు తుది కసరత్తు చేశా రు. మాస్టర్ ప్లాన్ అమలు అయితే తూర్పులో జరిగే మార్పులుపై వారిరువురు కమిషనర్‌తో చ ర్చించారు. మాస్టర్ ప్లాన్‌లోని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు ఏఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నాయని దానిపై పరిశీలించారు. ఎమ్మెల్యే నరేందర్‌ను అడగగా మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌లో తూర్పు నియోజకవర్గం పరిస్థితిని సమీక్షించామని చెప్పారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...