దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి


Sun,February 17, 2019 03:24 AM

కాజీపేట, ఫిబ్రవరి 16: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పలుచోట్ల విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని నినాదాలు చేశారు. కాజీపేటలో ట్రైసీటీ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు జెర్రి పోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు. విజేత, అక్షర, సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, డీజిల్ కాలనీ చౌరస్తా నుంచి కాజీపేట చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కాజీపేట సీఐ అజయ్, ట్రైసీటీ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌవర అధ్యక్షడు సిరిల్ లారెన్స్, ఆటో యూనియన్ నాయకులు మర్యాల కృష్ణ, బండి విజయ్‌కుమార్, సిలువేరు భాస్కర్, దుప్పటి శివకుమార్, రవీందర్, రాజేశ్, పరమేశ్వర్, కృష్ణంరాజు,రాజు, పైడయ్య,రాజబాబు, సారంగపాణి, సుల్తాన్, కేశవులు, నాగరాజు, శ్రీనివాస్, అశోక్, సురేశ్, టీఆర్‌ఎస్ నాయకులు సంక సతీశ్, భిక్షపతి, జానకీరాం, శివకృష్ణ, శ్రీనివాస్, ఈశ్వర్, కిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు.దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...