ముగిసిన మొదటి విడత ఎన్నికలు


Tue,January 22, 2019 03:00 AM

ఐనవోలు జనవరి 21 : గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 16 పంచాయతీలకు గాను లింగమోరి గూడెం, ఉడుతగూడెం, గర్మిళ్లపల్లి గ్రామాలు ఏకగ్రీవంగా నిలిచాయి. రాంగనర్, పంథిని సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. 11 పంచాయతీలకు 33 మంది సర్పంచ్ అభ్యర్థులకు పోటీ జరిగింది. 160 వార్డు సభ్యులకు 39 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 121 వార్డులకు 260 మంది పోటీల్లో ఉన్నారు. మండల మొత్తంలో 23,135 ఓటర్లు ఉండగా, 21,045 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 91.45 శాతం పోలింగ్ నమోదు అయ్యాయి. పెరుమాండ్లగూడెంలో అత్యధికం 97.25 శాతం, నర్సింహులగూడెం లో అత్యల్పం 86.06 శాతంగా ఓట్లు నమోదు జరిగింది. మండలంలోని కొండపర్తి, ముల్కలగూడెం, ఐనవోలు, పున్నేల్ పోలింగ్ కేంద్రాలను జేసీ దయానంద్ ఎంపీడీవో స్వరూపతో కలిసి పరిశీలించారు. ఆదే విధంగా మామునూర్ ఏసీపీ ప్రతాప్ ఎస్సై నర్సింహరావులతో కలిసి పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు పరిశీలించారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...