అంబాలలో బియ్యం పట్టివేత


Tue,January 22, 2019 03:00 AM

కమలాపూర్, జనవరి 21 : మండలంలోని అంబాల గ్రామంలో వెంకటేశ్వర మాడ్రన్ రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు అసిస్టెంట్ సివిల్ సప్లయ్ వరంగల్ అర్బన్ జిల్లా అధికారి నసిరోద్దిన్ సోమవారం తెలిపారు. గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్ ప్రజా పంపిణీ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారని విజిలెన్స్ ఎన్ ఇన్ మల్లయ్యకు సమాచారం అందింది. సమాచారం రావడంతో అంబాల గ్రామంలోని వెంకటేశ్వర రైస్ వెళ్లినట్లు చెప్పారు. రైస్ మిల్లులో రీ సైక్లింగ్ చేసిన 30క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం మినీ ఆటో ట్రాలీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ 2రూ.లక్షల 25వేలు ఉంటుందన్నారు. వెంకటేశ్వర మాడ్రన్ రైస్ సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రిసైక్లింగ్) కింద ఆరు వేల క్వింటాళ్ల వరిదాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించినట్లు చెప్పారు. కెటాయించిన వరిదాన్యాన్ని రైస్ మిల్లు యజమాని బియ్యం పట్టించి ప్రభుత్వానికి 4వేల క్వింటాళ్లు అప్పగించినట్లు తెలిపారు. మిగతా 2వేల క్వింటాళ్ల దాన్యాన్ని బియ్యం పట్టించి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా దాన్యం అక్కడే ఉంచి గ్రామాల్లో ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు నిల్వ ఉన్న 1612క్వింటాళ్ల దాన్యం, 213 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రైస్ యజమాని రాంచందర్, మినీ ఆటో ట్రాలీ డ్రైవర్ రాజేందర్ 6-ఏ కేసుతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో డీటీసీఎస్ రాజ్ జయశ ంకర్ తదితరులున్నారు.

293
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...