విదేశి విద్యకు దరఖాస్తుల స్వీకరణ


Tue,January 22, 2019 03:00 AM

అర్బన్ జనవరి 21: విదేశాలల్లో విద్యను అభ్యసించాలనుకొని వరంగల్ అర్బన్ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఆర్ వసంతం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా మహాత్మాజ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించొద్దని, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉండాలని సూచించారు. ఈ పథకం కింద ఇంజినీరింగ్, మేనేజ్ అగ్రికల్చరల్ సైన్స్, మెడిసిన్ వంటి కోర్సుల్లో 60 శాతం మార్కులు తప్పకుండా ఉండాలన్నారు. దరఖాస్తుతో ఆధార్ కార్డు, ఈ పాస్ ఐడీ నెంబర్, పాస్ కాపీ, మీ సేవ నుంచి పొందిన కులం, ఆదాయం, స్థానికత, పుట్టిన తేదీ, ఎస్సెస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీపీ స్థాయిలో విదేశీ యూనివర్సిటీ నుంచి సీటు పొందిన ప్రవేశ అడ్మిషన్ ఉత్తరం, టాక్స్ అసెస్ ట్, కాపీ, జాతీయ బ్యాంకు పాస్ తదితర పత్రాలు జతచేయాలన్నారు. ఇతర వివరాలకు http;//telanga na epass.cgg.gov.in వెబ్ చూడాలని ఆయన పేర్కొన్నారు.

293
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...