ఎర్ర బంగారంతో కళకళలాడిన మార్కెట్


Tue,January 22, 2019 02:59 AM

కాశీబుగ్గ, జనవరి 21: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. గత సీజన్ పోల్చితే ఈ సీజన్ అత్యధికంగా మార్కెట్ మిర్చి బస్తాలు వచ్చాయి. మార్కెట్ ఎటు చూసినా మిర్చి బస్తాలతో కళకళలాడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మార్కెట్ వరుసగా సెలవులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున మిర్చి వచ్చినట్లు పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. సీజన్ ప్రారంభంలో మిర్చి అధికంగా రావడంతో కార్మికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులతో పాటు అడ్తి, ఖరీదు వ్యాపారులు సైతం సంతోషపడుతున్నారు. కాగా ధరలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులు కొంత నిరుత్సాహం పడుతున్నారు. డబ్బులు అవసరం ఉన్న రైతులు మాత్రమే సరుకును అమ్ముకుంటున్నారు. మరికొందరు మాత్రం మరుసటి రోజు లేదా ధరలు వచ్చినప్పుడే అమ్ముకుందామని కోల్డు స్టోరేజీల్లో నిల్వలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. సోమవారం మార్కెట్ సుమారు 20వేల బస్తాలు వచ్చినట్లు తెలుస్తుంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ మిర్చి బస్తాలు 70 వేల వరకు వచ్చాయి. మార్కెట్ అధికారుల గణాంకాల ప్రకారం నేడు 14వేల బస్తాలు వచ్చాయి. అందులో తేజ రకం 9581 బస్తాలు రాగా గరిష్టంగా ధర రూ.8, 700, మధ్యరకం రూ.7,500, కనిష్టంగా రూ.6,500 వేలు పలికాయి. వండర్ రకం 1435 బస్తాలు రాగా ధరలు గరిష్టంగా క్వింటాల్ రూ.10,800, మధ్యరకం రూ.9,500, కనిష్టంగా రూ7వేలు, యూఎస్ 341రకం 793 బస్తాలు రాగా గరిష్టంగా రూ.8800, మధ్యరకం రూ.8వేలు, కనిష్టంగా రూ.7,500, తాలు రకం మిర్చి 1416 బస్తాలు రాగా ధరలు గరిష్టంగా రూ.4500, మధ్యరకం రూ.3000, కనిష్టంగా రూ.1500లు ధరలు పలికినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...