ఓటెత్తిన పల్లెలు


Tue,January 22, 2019 02:59 AM

-తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
-89.02శాతంపోలింగ్ నమోదు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఓటెత్తిన పల్లెలు.. హోరా హోరీగా జరిగిన ప్రచారం.. ఇల్లిల్లూ కలియదిరిగిన అభ్యర్థుల ప్రచారం.. ఓటు చైతన్యం కోసం అధి కారులు విస్తృతంగా కల్పించిన అవగాహన ఫలితంగా పల్లెలు ఓటెత్తాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పొగమంచును సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఎడమచేతి మధ్యవేలికి సిరా మరక వేసుకొని ఓటర్లు మురిసిపోయారు. ఉదయం నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు గ్రామాలన్నీ కిటకిటలాడాయి. ఓటేసి రావాలెని హైదరాబాద్ సహ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ స్వగ్రామాలకు తరలివచ్చి ఓటేసిపోయారు.
వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాల్లోని 49 గ్రామ పంచాయతీలకు గానూ పది పంచాయతీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 39 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు మండలాల్లోని 73,516 ఓటర్లు ఉండగా ఇందులో 65,446 మంది తమ ఓటుహక్కును (89.02శాతం) వినియోగించుకున్నారు.

ఉదయం నుంచే బారులుదీరిన జనం
పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం ఏడుగంటల నుంచే జనం తరలివచ్చారు. ముందు రెండుగంటలకు ఆ తర్వాత మూడు మండలాల్లో 36.29 శాతం పోలింగ్ నమోదు కాగా (వేలేరులో 31.01 శాతం, ధర్మసాగర్ మండలంలో 34.01 శాతం, ఐనవోలులో 47.76శాతం) మధ్యాహ్నం పోలింగ్ ముగిసే సమయానికి 89.02శాతం ఓటింగ్ నమోదైంది. ధర్మసాగర్ మండలంలో 87.62 శాతం, వేలేరు మండలంలో 89.02 శాతం, ఐనవోలు మండలంలో అత్యధికంగా 90.97శతం పోలింగ్ నమోదైంది.
కాగా, మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీల్లో ఐనవోలు మినహా రెండు మండలాల్లో జిల్లా సగటు కన్నా తక్కువగా పోలింగ్ జరగడం విశేషం. మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీల్లో పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది. వేలేరు గ్రామ పంచాయతీలో 83.46శాతం, ధర్మసాగర్ మం డల కేంద్రం గ్రామ పంచాయతీలో 86.51శాతం, ఐనవోలు మండలంలో 89.36 శాతం పోలింగ్ నమోదైంది.
కట్టుదిట్టమైన భద్రతా-పర్యవేక్షణ
తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించడమే కాకుండా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ దేవానంద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, ఆర్డీవో వెంకారెడ్డి సహ పలువురు ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, పో లింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు భే షుగ్గా ఉన్నాయని ఓటర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సదుపాయాలు, మంచీనీటి ఏర్పాట్లతోపాటు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తొలి విడత జరిగిన ఎన్నికలు ప్రశాంతం కావడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల విధి నిర్వహణలో తలమునకలై విజయవంతం చేసిన సిబ్బందిని అభినందించారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...