నేడే తొలి సంగ్రామం


Mon,January 21, 2019 01:46 AM

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ తొలిసమరం నేడే. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛాపూరిత వాతావరణంలో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరికొద్ది సేపల్లో ప్రారంభమయ్యే పోలింగ్‌కు ప్రజలు తమతమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓట్ల్రు బారులు దీరబోతున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దూరతీరాల నుంచి పల్లెలకు వచ్చారు.

అర్బన్ జిల్లాలో తొలి విడతలో ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాల్లోని 49 గ్రామ పంచాయతీలు, 472 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 138 వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికలు జరిగే 39 సర్పంచ్‌స్థానం కోసం 260 మంది, 384 వార్డు సభ్యుల కోసం 1261 మంది పోటీపడుతున్నారు. ఈ మూడు మండలాల్లోని ఓటర్లు 98,186 మంది ఓటర్లు (ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు, వార్డులతో సహ) తమతమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

ఇదీ తొలిదశ ముఖచిత్రం ..
ధర్మసాగర్ మండంలో 19 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ఐదు గ్రామాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 14 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నేడు ఉదయం 7 గంట నుంచి 1గంట వరకు జరగబోతున్నాయి. 186 పోలింగ్ స్టేషన్లున్నాయి. అదే ఐనవోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం (అయితే మూడు చోట్ల పూర్తి (సర్పంచ్ సహ పూర్తి వార్డులు,) మిగిలిన రెండు గ్రామాల్లో కొన్నిచోట్ట వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి. వేలేరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 126 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మండలంలో ఏకగ్రీవాలు కాకపోవడం గమనార్హం. 472 పోలింగ్ స్టేషన్లకు గానూ 384 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ స్టేషన్ల స్టేటస్..
తొలి దశలో జరిగే పోలింగ్ కేంద్రాల్లో సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 198, హైపర్‌సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 218, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 48 ఉన్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. మిగితా పోలింగ్ కేంద్రాలు సాధారణ పోలింగ్ కేంద్రాలు. వీటిల్లో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు ఈ మూడు మండలాల్లో పోలింగ్ సిబ్బంది రిటర్నింగ్ అధికారులు 19 మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 58 మంది, 670 మంది ప్రైసైడింగ్ అధికారులు, 146 మంది అసిస్టెంట్‌తోపాటు మిగితా పోలింగ్ అసిస్టెంట్స్ ఇలా మొత్తం 1621 మంది సిబ్బంది పోలింగ్‌కు పోలింగ్ అనంతరం కౌంటింగ్ కోసం 625 మంది అధికారులు వారి వారి విధుల్ని నిర్వహించేందుకు సిద్ధమై ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...