విశ్వనాథరావు సేవలు చిరస్మరణీయం


Mon,January 21, 2019 01:44 AM

- రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు
మడికొండ, జనవరి 20: ప్రముఖ వైద్యుడు, రవి నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ విశ్వనాథరావు సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం కాజీపేటలో విశ్వనాథరావు స్వగృహంలో ఆయన వర్ధంతి సందర్భంగా కెప్టెన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై విశ్వనాథరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ కాజీపేట అభివృద్ధిలో విశ్వనాథరావు పాత్ర మరువలేనిదన్నారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వంతో పోరాటాలు చేసిన వ్యక్తిగా అభివర్ణించారు. పేదల పక్షపాతిగా, ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల్లో అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. విశ్వనాథరావుకు నివాళులర్పించిన వారిలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భాస్కర్‌రావు, శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ జీవీ రామకృష్ణరావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, దివంగత మాజీ ప్రధాని పీవీ చిన్న కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, సోదరుల కుమారులు పీవీ సీతారామారావు, పీవీ మదన్‌మోహన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నారాయణరెడ్డి, కల్పన దవాఖానాల చైర్మన్ నర్సింహారెడ్డి, హైదరాబాద్ దిండిగల్ దత్తపీఠం ట్రస్టీ వైవీ.చంద్రశేఖర్‌రావు,

వరంగల్ దత్తపీఠం ట్రస్టీ వామన్‌రావు, విశ్రాంత పోలీస్ అధికారులు చంద్రప్రకాశ్, చంద్రమౌళి, వెంకటేశ్వర్‌రావు, కరీంనగర్ జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తి కల్వల దేవీప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వైవీ రామారావు, సిద్దిపేటకు చెందిన ప్రముఖ వైద్యులు రమక శ్రీనివాస్, జనార్దన్, సూరి, సోమ మాధవరావు, శివసుబ్రహ్మణ్యం, తెలంగాణ నియోగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బండారు రాంప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌శర్మ, వరంగల్ బ్రాహ్మణ సంఘం నాయకులు పవన్‌కుమార్, మోత్కూరి మనోహర్‌రావు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, జిల్లా నాయకులు పరాశరం నర్సింహాచార్యులు, శివపురం రామలింగా ఆరాధ్య, నాగరాజు, రవీందర్‌రావు, జీవీఎస్ శ్రీనివాసాచారి, వల్లూరి పవన్‌కుమార్, వేద పండితులు అవధానుల దత్తాత్రేయశర్మ, గొడిశాల చంద్రశేఖర్‌శర్మ, సీతారామశర్మ, జగర్లమూడి వీరభద్రశర్మ, కార్పొరేటర్లు సదానందం, వద్దిరాజు గణేశ్, ఏఐఎల్‌డీఎఫ్ అధ్యక్షుడు పింగిళి వెంకటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

పేద ప్రజలకు సేవలందించిన విశ్వనాథరావు
గ్రామీణ నిరుపేద రోగులకు నిరంతర వైద్య సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ విశ్వనాథరావు అని మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాజీపేటలోని విశ్వనాథరావు నివాసంలో ఆదివారం జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ విశ్వనాథరావు నిగర్వి, మానవతామూర్తి అని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై సేవాభావంతో పని చేశారన్నారు. కాజీపేట, వరంగల్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్, రోటరీక్లబ్స్ వంటి సంస్థలతో కలిసి సేవలు అందించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లతో కలిసి పాల్గొన్నారని, విశ్వనాథరావు ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఏసీపీ జనార్దన్, వొడితెల కుటుంబ సభ్యులు డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ లలిత, డాక్టర్ గుండమరాజు నరసింహరావు, వొడితెల కిషన్‌రావు, శ్రీనివాసరావు, తుమ్మల శ్రీరాంరెడ్డి, పేరాల గోపాల్‌రావు, కటంగూరి రాంచంద్రారెడ్డి, తోట రాజేంద్రప్రసాద్, చందా గాంధీ తదితరులు పాల్గొన్నారు..

206
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...