గ్రేటర్ కమిషనర్‌గా రవికిరణ్


Mon,January 21, 2019 01:43 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎన్ రవికిరణ్ నియమితులయ్యారు. శనివారం రా త్రి కమిషనర్ వీపీ గౌతమ్ బదిలీ అయిన విషయం విధి తమే. ఈమేరకు మున్సిపల్‌శాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా ఉ న్న ఎన్ రవికిరణ్‌ను గ్రేటర్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 గ్రూప్ వన్ అధికారి అయి న రవికిరణ్ రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ సర్వీస్‌లో చేరారు. 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ మ హా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నారు. చార్మినార్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అదనపు కమిషనర్‌గా పబ్లిక్ హెల్త్, పారిశుధ్య విభాగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అయనను గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

బాధ్యతల స్వీకరణ
గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ఎన్ రవికిరణ్ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కారర్పొరేషన్ ప్రధా న కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్వులు వెలువడిన వెంట నే ఆయన సెలవు రోజు అయినప్పటికీ సాయంత్రం కార్పొరేషన్‌కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉద్యోగులు రవికిరణ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతోపాటు ఎంహెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, చీఫ్ హార్టికల్చర్ అధికారి సునీత, డి ప్యూటీ కమిషనర్ రాజు, ఎస్‌ఈ భిక్షపతి, ఎంహెచ్‌వో డాక్ట ర్ రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత, డిప్యూటీ కమిషనర్ రాజు, పీఆర్‌వో గౌస్, ఈఈలు విద్యాసాగర్, రాజ్‌కుమార్, రాజ య్య, డీఈ, ఏఈలు ఉద్యోగులు పెద్దఎత్తున కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేటర్‌లో నాలుగో కమిషనర్
వరంగల్ కార్పొరేషన్ గ్రేటర్‌గా మారిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో రవికిరణ్ నాలుగో కమిషనర్. నా లుగేళ్ల కాలంలో నలుగురు కమిషనర్లు మారారు. గ్రేటర్ తొలి కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ పని చేశారు. ఆయన ఒక్కరే ఏడాదికిపైగా విధులు నిర్వర్తించారు. తర్వాత శృతి ఓజా, వీపీ గౌతమ్ కమిషనర్లుగా పని చేశారు. వీరు ఏడాది కాలం నిండాకుండానే బదిలీ అయ్యారు. గ్రేటర్‌లో పని చే సిన ముగ్గురు కమిషనర్లు ఐఏఎస్ అధికారులు కాగా, ఎన్ రవికిరణ్ మాత్రం గ్రూప్ అధికారి కావడం గమనార్హం.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...