డాక్టర్ విశ్వనాథరావు సేవలు మరువలేనివి


Sun,January 20, 2019 02:58 AM

-ఎంపీ బోయినపల్లి వినోద్
కాజీపేట, జనవరి 19 : ప్రజా వైద్యులు డాక్టర్ వొడితల విశ్వనాథరావు నిరుపేద రోగులకు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ అన్నారు. కాజీపేటలోని రవి నర్సింగ్ హోంలో విశ్వనాథరావు ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్ని విశ్వనాథరావు చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడారు. డాక్టర్ విశ్వనాథరావు వ్యాపార ధృక్పథంతో కాకుండా మానవతా విలువలతో వైద్య సేవలు అందించారన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై సేవలందించారని కొనియాడారు. ఆయన జీవనం అందరికీ ఆదర్శమని ఆయన అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఆయన ఆశయ సాధనకు అభిమానులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ గొర్రెల కాపరుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, తనయుడు డాక్టర్ పవన్ వొడితల శ్రీనివాసరావు, కిషన్ కౌషిక్, కపిల్, ప్రణవ్, ఇంద్రనీల్, కటంగూరి రాంచంద్రారెడ్డి, పేరాల గోపాలరావు, పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు, వైద్యులు ప్రముఖులు పాల్గొన్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...