కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల


Sun,January 20, 2019 02:57 AM

హన్మకొండ, నమస్తే తెలంగాణ : కాకతీయ యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంట రీ పరీక్ష ఫలితాలను కేయూ వీసీ ఆర్ సాయన్న, రిజిస్ట్రార్ కే పురుషోత్తం, పరీ క్షల నియంత్రాణాధికారి ఎస్ మహేందర్ శనివారం విడుదల చేశారు. గత అక్టోబర్ నెలలో జరిగిన డిగ్రీ మొదటి, రెండు, మూడో సంవత్సరం పరీక్షల్లో 41,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, ఉత్తీర్ణత శాతం 36.19 ఉత్తీర్ణతను సాధించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరలో 2457 మంది దరఖాస్తు చేయగా 2029 మంది పరీక్షకు హాజరుకాగా 682 మంది ఉత్తీర్ణతను సాధించి 33.61 శాతం, రెండో సంవత్సరంలో 3860 మంది ద రఖాస్తు చేయగా 3178 మంది పరీక్షలకు హాజరు కాగా 914 మంది ఉత్తీర్ణను సాధించి 28.76 శాతం, మూడో సంవత్సరంలో 4802 మంది దరఖాస్తు చేయగా 4232 మంది పరీక్షలకు హాజరు కాగా 837 మంది ఉత్తీర్ణత సాధిం చి 31.44శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పరీక్ష ఫలితాలను కేయూ వెబ్ ఉంచామని, విద్యార్థులు మార్కుల వివరాలను పొందవ చ్చునని వారు తెలిపారు. జనవరి 30వ తేదీ వరకు విద్యార్థులు రీవాల్యూవే షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రాణాధికారులు డాక్టర్ పీ సదానందం, డాక్టర్ వై వెంకయ్య, డాక్టర్ ఎం సురేఖ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామ వెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నరేందర్, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...