కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


Sun,January 20, 2019 02:56 AM

అర్బన్ కలెక్టరేట్ : మాతా శిశు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మరింత మెరుగైన సేవలు అందించేందు కు ఏఎన్ ఏఎస్ స్థాయి పనితీరును సమీక్షించి, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం డీఎంఅండ్ ప్రోగ్రాం అధికారులతో కలిసి పీహెచ్ వారిగా కార్యక్రమాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా అమలులో వెనుకబడి ఉన్న వాటికి కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డీఎంఅండ్ ప్రోగ్రాం అధికారులు ముందుగా 11 పీహెచ్ ఆయా స్థాయి నుంచి ప్రగతిని సమీక్షించాలని, సూపర్ బాధ్యులను చేసి పనితీరు మెరుగుపర్చాలన్నారు. ప్రతీ గర్భిణి గర్భనిర్థారన జరిగిన వెంటనే ఏఎన్ పీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ చెకప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతంలో కొంత సమస్య ఉన్నప్పటికీ ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.
జిల్లలో మొత్తం 12,460 గర్భిణులు నమోదు చేసుకున్నారని, మొత్తం 16,312 ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగగా వీటిలో 11,987 ప్రభుత్వాస్పత్రుల్లో జరిగియాని ఆయన తెలిపా రు. అన్ని పీహెచ్ ప్రసవాలు రెగ్యులర్ జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన అభివృద్ధి పనులకు ఎన్ నిధులు వినియోగించాలన్నారు.

ప్రభుత్వం టీబీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500ల నగదు బదిలీ చేస్తుందని, ప్రైవేట్ చికిత్స పొందుతున్న వారి విషయం లో అన్ని ఆస్పత్రులు వివరాలు పూర్తిస్థాయలో అం దించాలన్నారు. నమోదైన లెప్రసీ వ్యాధిగ్రస్తులతో ఫోన్ ద్వారా సంప్రదించి వారికి అందుతున్న చికిత్స, ఫాలోఅప్ సేవలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమం పూర్తి కావస్తున్నందున ఆశావర్కర్లు, ఏఎన్ మిగిలిన వారికి సమాచారం అందించి అందరూ వచ్చేలా కృషి చేయాలన్నారు. పీహెచ్ ఓపీ సేవలను మరిం త పెంచాలన్నారు. రిపోర్టింగ్ విధానాన్ని మరింత మెరుగు పర్చాలన్నారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు జనవరి ఒకటి నుంచి అయిన జనన వివరాలు నమోదు పూర్తిచేసి ఏ రోజుకారోజు ఆన్ నమోదు చేయాలని ఆదేశించారు. తీసుకుంటున్న చర్యలు, యాక్షన్ ప్లాన్ గురిం చి డీఎంఅండ్ హెచ్ హరీష్ వివరించారు. సమవేశంలో అడిషనల్ డీఎంఅండ్ డాక్టర్ మధన్ డిప్యూటీ డీఎంఅండ్ ఎండీ యాకూబ్ ప్రోగ్రాం అధికారులు గీతాలక్ష్మి, ఉమశ్రీ, మల్లికార్జున్, డీఈఎంవో అశోక్ తదితరులున్నారు.

293
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...