ముగిసిన నామినేషన్ల పర్వం


Sat,January 19, 2019 03:06 AM

-మూడు రోజుల్లో 2173నామినేషన్లు దాఖలు
-సర్పంచ్ 464..వార్డు సభ్యులకు1709
అర్బన్ కలెక్టరేట్, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. మూడవ విడత ఎన్నికలు నిర్వహించే 58 పంచాయతీలకు రెండు రోజులలో సర్పంచ్, వార్డు సభ్యులకు కలిపి మొత్తం 2173నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ అభ్యర్థులుగా 464 మంది, వార్డు సభ్యులుగా 1709 మంది నామినేషన్స్ వేశారు. కాగా మూడవ విడతలో ఎల్కతుర్తి, హసన్ కమలాపుర్ మూడు మండలాలలోని 58 గ్రామ పంచాయతీలు, 558 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన బుధవారం మొదటి రోజు ఎల్కతుర్తి మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో 16 మంది సర్పంచ్ 174 వార్డులకుగాను 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హసన్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 13 మంది సర్పంచ్ వార్డులకుగాను 31 మంది, కమలాపుర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 20 మంది సర్పంచ్ 246 వార్డులకుగాను 53 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు గురువారం ఎల్కతుర్తి మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో 43 మంది సర్పంచ్ 174 వార్డులకుగాను 147 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హసన్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 31మంది సర్పంచ్ వార్డులకుగాను 142 మంది, కమలాపుర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 54 మంది సర్పంచ్ 246 వార్డులకుగాను 227 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం ఎల్కతుర్తి మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో 90 మంది సర్పంచ్ 174 వార్డులకుగాను 338 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హసన్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 63మంది సర్పంచ్ వార్డులకుగాను 232 మంది, కమలాపుర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 134 మంది సర్పంచ్ 246 వార్డులకుగాను 506 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మూడు రోజులలో కలిపి ఎల్కతుర్తి మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా 149 మంది, వార్డు సభ్యులుగా 518 మంది నామినేషన్లు వేసారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...