ఎంజీఎంలో ఘర్షణ..!


Sat,January 19, 2019 03:04 AM

-ఎస్పీఎఫ్ పోలీసులతో మృతుడి బంధువుల వాగ్వాదం
-పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎంజీఎం : నిత్యం అత్యవసర రోగుల రాకపోకలతో రద్దీగా ఉండే ఎంజీఎం దవాఖానలో శుక్రవారం సాయంత్రం స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో సుమారు అత్యవసర చికిత్సా కేంద్రంలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. వైద్య సిబ్బంది కథనం ప్రకారం. ఏఎంసీ వార్డులో రోగి మృతి చెందడంతో విషయం తెలిసి అతని కుమారుడుతోపాటు బంధువులు వార్డుకు తరలివస్తుండటాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసి దవాఖానలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను నివారించే ప్రయత్నం చేస్తుండగా ఇంతలో మృతుడి కుమారుడు మరొకరు కలిసి సదరు పోలీసులపైకి ఘర్షణకు దిగారు. ఒక దశలో పోలీసులపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో క్యాజువాలిటీ ఆవరణలో మృతుడి బంధువులు, జనంతో నిండిపోయింది. సమాచారం అందుకున్న మట్టెవాడ పోలీసులు దవాఖానకు చేరుకుని ఘర్షణకు దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం పూచికత్తుతో వారిని వదిలి పెట్టగా మృతదేహాన్ని యూనివర్సిటీ సమీపంలోని పెగడపెల్లి(డబ్బాల) ప్రాంతానికి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...