హృదయ్ పనుల్లో వేగం..


Sun,December 16, 2018 02:35 AM

-మార్చి నాటికి పనులు పూర్తి
-ప్రత్యేక దృష్టిసారిస్తున్న అధికారులు
వరంగల్, నమస్తేతెలంగాణ : వారసత్వ నగరం వరంగల్‌లో హృదయ్ పథకం పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చారిత్రక నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన హృదయ్ పథకంలో వరంగల్ నగరాన్ని చేర్చి చారిత్రక కట్టడాల అభివృద్ధికి శ్రీకారం చు ట్టింది. రెండేళ్ల కిత్రం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వరంగల్ నగరంలోనే హృదయ్ పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించిన విష యం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హృదయ్ పను లు నత్తనడక సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న హృదయ్ పనులను వేగవంతం చేయాలని వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెండు రోజుల కిత్రం అధికారులతో హృదయ్ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై సమాచారం సేకరించారు. హృదయ్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి రాబోయే రోజుల్లో చారిత్రక నగరాన్ని పర్యాటక పాతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అధికారులు అడుగులు వేస్తున్నారు.

రూ.35 కోట్ల నిధులతో..
హృదయ్ పధకంలో భాగంగా నగరంలో రూ.35 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నగరంలోని భద్రకాళి బండ్ సుందరీకరణ, వేయి స్తంభాల దేవాలయం, జైన్ గుట్టలు, ఖిలావరంగల్ కోట అభివృద్ధికి హృదయ్ నిధులతో శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కాజీపేట దర్గా అభివృద్ధి పనులు పూర్తి చేశారు. భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు దాదాపు 70 శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాకింగ్ ట్రాక్, బండ్ పునర్నిర్మానం, గ్రీనరీ, సైకిల్ ట్రాక్, వ్యూ పా యింట్, పేరిట బండ్‌పై అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాకతీయుల కళా నైపుణ్యత ఉట్టిపడేలా శిల్పల నమూనాలు బండ్‌పై ఏర్పాటుచేస్తున్నారు. మూడు దశలలో భద్రకాళి బండ్ అభివృద్ధి చేసేందుకు కుడా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఖిలావరంగల్‌లో శృంగా ర బావి, కాకతీయ కళాతోరణాల అభివృద్ధి, దేశ, విదేశాల పర్యాటకుల కోసం రిసార్ట్‌ల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. జైన్ గుట్టల అభివృద్ధికి హృదయ్ నిధులను వెచ్చిస్తున్నారు. గుట్టపైకి వెళ్లడానికి మెట్లు నిర్మిస్తున్నారు. అలాగే జైన్ గుట్టల అభివృద్ధి హృదయ్ నిధులతో జరుగుతోంది. పద్మాక్షి దేవాలయ ప్రాంగణంలో గ్రీనరీ అభివృద్ధి, వేయి స్తంభా ల దేవాలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా నగరానికి నూతన శోభ రానుంది.

మార్చి చివరి నాటికి పూర్తి..
హృదయ్ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. మొదట డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అనుకున్నప్పటికి శాసన సభ ఎన్నికలతో పనులలో జాప్యం జరిగిందని అధికారులు అంటున్నారు. మార్చి చివరి నాటికి హృదయ్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కుడా వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ హృదయ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కచ్చితంగా మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అనుకున్న సమయం మార్చి నాటికి హృదయ్ పనులు పూర్తయితే నగరానికి కొత్త అందాలు వస్తాయి.

390
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...