ఫ్యాషన్ డిజైన్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం


Sun,December 16, 2018 02:33 AM

న్యూశాయంపేట, డిసెంబర్15 : నిప్ట్ కళాశాల ద్వారా ఫ్యాషన్ డిజైన్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ టీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిప్ట్ కళాశాల స్వయం ప్రతిపత్తి గల విద్యా సంస్థ అని, ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన విద్యా శిక్షణ ఇచ్చి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. నిప్ట్ విద్యాసంస్థ పార్లమెంట్ యాక్ట్ ద్వారా డిగ్రీ అందజేస్తున్నట్లు తెలిపారు. 25సంత్సరాలుగా ఈ కోర్సులను అందిస్తున్నామని, వస్త్ర పరిశ్రమ కోర్సులే కాకుండా గృహ అలంకరణ, టెక్సైల్ టెక్నాలాజీ, మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ విద్యార్థులకు 25నుంచి 75శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేష్, టెక్సైల్ డిజైన్, ఎక్స్‌సరీ డిజైన్, నిట్‌వేర్ డిజైనన్ ఫ్యాషన్ టెక్నాలాజీ కోర్సులు కాలపరిమితి 4సంవత్సరాలు, విద్యార్హతలు 10+2తో అందిస్తున్నామన్నారు. పీజీ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సును రెండు సంవత్సరాల కాలపరిమితి, ఏదైనా డిగ్రీతో చేయవచ్చని తెలిపారు. ఈ నెల 22న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందని 28న ముగుస్తుందని, జనవరి 3వరకు రూ.5వేల అపరాధ రుసుముతో ఫీజులు చెల్లించవచ్చని అన్నారు. జనవరి 20న అండర్ గ్రాడ్యూయేట్, పీజీ కోర్సులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. అలాగే గృహిణులు, ఉద్యోగస్తులకు పార్ట్‌టైం సర్టిఫికెట్ కోర్సులు సైతం అందిస్తున్నట్లు చెప్పారు. కావున అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

391
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...