20న మినీ జాబ్ మేళా


Sun,December 16, 2018 02:33 AM

పోచమ్మమైదాన్, డిసెంబర్ 15: వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 20న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నోడల్, అర్బన్ జిల్లా ఉపాధి అధికారి ఎం మల్లయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలు కంపెనీల్లో ఖాళీగా ఉన్న 820 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అపోలో ఫార్మసీ, మాక్స్‌కేర్ హాస్పిటల్, ఈక్విటీ గ్రూప్, మేథా సర్వో ప్రైవేట్ లిమిటెడ్, నవత ట్రాన్స్‌ఫోర్టు, టీం లీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఠం గ్రూప్, శుభగృహ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్, అపోలో హోమ్ కేర్‌లో పని చేసేందుకు టెన్త్ పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, ఐటీఐ ఫిట్టర్, వెల్డర్, బీకాం, బీఎస్సీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, బీటెక్/ఎంటెక్ (కెమికల్), ఎంబీఏ, పీజీ పూర్తి అభ్యర్థులు ఇంటర్యూకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.8000 నుంచి రూ.20వేల వరకు వేతనం చెల్లిస్తారని,18 నుంచి 35 సంవత్సరాల వరకు స్త్రీ, పురుష అభ్యర్థులకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడెటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ల జీరాక్స్ కాఫీలతో 20న ఉదయం 10 గంటలకు జరుగు జాబ్ మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే జాబ్ మేళా పూర్తి సమాచారం కోసం నేషనల్ కెరీయర్ సర్వీసు వెబ్‌సైట్ జాబ్ సీకర్(www.ncs. gov.in/jobseeker) లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు యంగ్ ప్రొఫెషనల్ తాటిపాము ల రఘుపతి 8247656356 నంబర్ నందు సం ప్రదించాలని ఆయన సూచించారు.

250
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...