జీశాట్-7ఏ ప్రయోగంతో దేశ రక్షణ..


Sun,December 16, 2018 02:32 AM

హసన్‌పర్తి, డిసెంబర్ 15: జీ-శాట్-7ఏ ప్ర యోగం దేశ రక్షణకు దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్త రఘునందన్ అన్నారు. మండలంలోని పెంబర్తి ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు అంతరిక్షంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డైరెక్టర్, ఫౌండ ర్ ఆఫ్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త రఘునందన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అంతరిక్షం-పరిశోధన-ప్రయోగాలు-ఉపయోగాలపై అవగాహన కల్పించారు. అంతరిక్షం లో జరిగే అనేక మార్పులను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. డిసెంబర్ 19వ తేదీన జీ-శాట్-7ఏ ఉపగ్రహాన్ని ఇస్రో వారు అంతరిక్షంలోకి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఉప గ్రహం దేశ భద్రతకు ఉపయోగపడుతుందన్నారు. వీటితో పాటు జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ ఉపగ్రహాల గురించి వివరించారు. ఐపీఎస్ పాఠశాలలో జీ-శాట్-7ఏ ను డిసెంబర్ 19వ తేదీన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మొర్రి కుమార్‌యాదవ్, తీగల భరత్‌గౌడ్, బోడకుంట రాజుకుమార్, కొక్కెరకొండ రవి, తుమ్మ మధు మాట్లాడుతూ ఇటువంటి కా ర్యక్రమాల ద్వారా విద్యార్థులు స్ఫూర్తిపొంది భ విష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యామసాని రాజు, ఉపాధ్యా యులు, సిబ్బంది పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...