అభ్యర్థులపై అనర్హత వేటు


Sun,December 16, 2018 02:32 AM

-2013 జీపీ ఎన్నికల ఖర్చు చూపని అభ్యర్థులపై ఈసీ సీరియస్
-మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆదేశం
కమలాపూర్: 2013లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లెక్కలు చూపని అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మూడేళ్లపాటు పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించింది. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు చూపకపోవడంతో ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులను అభ్యర్థుల పేర్లతో విడుదల చేసింది. అయినప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చులను ఎన్నికల అధికారులకు సమర్పించలేదు. ఎ న్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన, ఓడిన ఖర్చుల వివరాలను 45 రోజుల్లో ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. 2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి న సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొంతమం ది ఖర్చుల వివరాలు చూపెట్టకపోవడంతో మూడేళ్లపాటు ఎన్నికల్లో పో టీ చేసేందుకు నిషేధం విధించింది.

పోటీకి అనర్హులు..
2013లో గ్రామ సర్పంచ్‌లుగా పోటీ చేసిన వారిలో భీం పల్లిలో ఆకినపల్లి రమేశ్, అంబాలలో సాం బయ్య, గిన్నార పు రవి, గోపాల్‌పూర్‌లో చెరిపెల్లి ఉమ, సౌందర్య వక్కల, గూనిపర్తిలో ఓనం పద్మ ప్రి య, చంద్రకళ రామగోని, ముత్యాల సుగుణ, కమలాపూర్‌లో ఓస్కుల అనిల్‌కుమార్, కా నిపర్తిలో ధర్ముల లక్ష్మి, కన్నూరులో పబ్బు వకుళ, పబ్బు విజ య, మాధన్నపేటలో పుణ్యవతి కుమ్మరి, పాముకుంట్ల మా ధవి, మర్రిపెల్లిలో నరెడ్ల రజిత, మర్రిపెల్లిగూడెంలో గ ట్టు కవిత, పుల్లూరి రాణి, మాదాడి కవిత, నెరెళ్లలో దొంగల శ్రీనివాస్, మోకిడె కిష్టయ్య, సఫియా, శంభునిపల్లిలో పెం డ్యాల తిరుపతిరెడ్డి, శనిగరంలో తడుక శ్రీకాంత్, శ్రీరాంలపల్లిలో గొర్రె సమ్మిరెడ్డి, వీరాటి మాధవరెడ్డి, ఉప్పల్‌లో అంజయ్య బచ్చలి, చంద్రమౌళి అలుగు, మొండయ్య ర్యా కం, రమేశ్ కొండలను అనర్హులుగా ప్రకటించారు.
వార్డు సభ్యులుగా పోటీచేసిన వారిలో భీంపల్లిలో 16 మంది, గోపాల్‌పూర్‌లో 18 మంది, గూడూరులో ఏడుగురు, గుండేడులో 10 మంది, గూనిపర్తిలో 13 మంది, కమలాపూర్‌లో 48 మం ది, కానిపర్తిలో 12 మంది, కన్నూరు లో 23 మంది, మాధన్నపేటలో 20 మంది, మర్రిపెల్లి లో 41 మంది, నేరెళ్లలో 21 మంది, శంభునిపల్లిలో నలుగురు, శనిగరంలో 24 మంది, శ్రీరాములపల్లిలో 18 మంది, ఉప్పల్‌లో 24 మంది, వంగపల్లిలో ఇద్దరు వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చు చూపని జాబితాలో ఉన్నారు.
మొదలైన పంచాయతీ సందడి
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం తో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో పంచాయతీ ఎన్నికలపై చర్చ జరుగుతోం ది. 2013లో ఎన్నికల రిజర్వేషన్లనే ప్రకటిస్తా రా..? మారుస్తారా..? అంటూ ఆశావహులు ప్రభుత్వ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

241
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...