అభివృద్ధి పనులను పరిశీలించిన


Sun,December 16, 2018 02:32 AM

-కుడా వైస్ చైర్మన్ గౌతమ్
-అధికారులకు సూచనలు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం చుట్టూ చేపడు తున్న ప్రహరీ నిర్మాణ పనులను శనివారం కుడా వైస్ చైర్మన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ వీసీ గౌతమ్ పరిశీలించారు. కుడా ఆధ్వర్యంలో కోటి రూపాయలతో ప్రహరీ నిర్మిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా కుడా వైస్ చైర్మన్ గౌతమ్, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావుతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ ద్వారం ప్రహరీ మొత్తం ఎర్రరాతితో నిర్మిస్తుడడంతో హర్షం వ్యక్తంచేశారు. వరంగల్ మహా నగరంలో నిర్మించే గోడలకు కూడా ఎర్ర రాతిని వినియోగిస్తే బాగుండేదని కుడా అధికారులతో అన్నారు. అదేవిధంగా ముఖద్వారం నిర్మాణ కో సం ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించారు. కాగా మండల కేంద్రంలో పార్కు ఏర్పాటు చేయాలని ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు కోరగా, స్పందించిన గౌతమ్ స్థలం గుర్తిస్తే, పార్కు నిర్మాణం చేపడుతామని అన్నారు. కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్‌రావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సిద్ధార్థనాయక్, ఎంపీటీసీ బొల్లెపల్లి మధు, ఈవో అద్దెంకి నాగేశ్వర్‌రావు, ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ తక్కళ్లపల్లి చందర్‌రావు, టీ ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్, మాజీ సర్పంచులు స్వామి, కొమురెల్లి, నాయకులు పరమేశ్, ఎల్లగౌడ్, ఎస్‌ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు, లొంక రమేశ్, రాములు, డబ్బా శ్రీను, ఆల య సిబ్బంది కిరణ్, మధుకర్ తదితరులున్నారు. అదేవిధంగా పున్నేల్ శివారు సర్వే నంబర్లు 111, 113, 115, 116,117, 142లోని సుమారు 22 ఎకరాల వెంచర్‌ను కుడా ఫ్లానింగ్ ఆఫీసర్ అ జిత్‌రెడ్డితో కలిసి కమిషనర్ పరిశీలించారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...