కార్యదక్షుడు.. కదన యోధుడు


Sat,December 15, 2018 03:40 AM

-గులాబీల్లో యువకెరటం
-నవనాయకుడి చేతిలో నవ నిర్మాణం
-మరింత అజేయశక్తిగా టీఆర్‌ఎస్
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
-నియామకంపై ఓరుగల్లులో సంబురాలు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ తరువాత. రాష్ట్రంలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ బ్రాండ్‌ని తనకు తానుగా తన పట్టుదల, కార్యాచరణతో సృష్టించుకున్న సునామీ. ఐకానిక్ ఇ మేజ్. చిరునవ్వుల చిద్విలాసం. ప్రత్యర్థులను చీల్చిచెండాడే నై జం. కాకలు తీరిన రాజకీయ దురంధులను మట్టికరిపించే వ్యూ హచతురత. ఎత్తులకు పైఎత్తులు వేసే వ్యూహకర్త. బోలీ బదల్తీ హై బాత్ నహీ బదల్తీ.. బద్లా తీర్చుకోవడంలో తనకు తానే సా టి. రామన్న ఇప్పుడు రాష్ట్రమంతా అందరి నోళ్లల్లో నాణుతున్న పేరు. ప్రత్యర్థి పార్టీలకు మింగుడు పడని పేరు. చూస్తే చిన్నపిలగాడే.. యలమందా.. తెలంగాణ జెండా పట్టినాడే.. యలమం దా.. తెలంగాణ ఉద్యమంలో మారుమోగినపాట. నాయకుడా.. నాయకుడా... ఇప్పుడు మారుమోగుతున్న నాయకుడు. అతడే కేటీఆర్. తనను తాను సమీకరించుకొని, ఆధ్యయనించి.. పట్టుదలతో నిరూపించుకున్న కార్యదీక్షుడు. కదనయోధుడు అతడే రామన్న.

అలుపెరుగని పోరాటంలో అనల్ప విజయాలు సాధించిన కార్యశీరుడు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడిభుజం. బంగా రు తెలంగాణ నిర్మాణంలో, ప్రజలయోగక్షేమాలే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తలమునకలయ్యారు. కేసీఆర్‌కు పార్టీపై కన్నా ప్ర జలపై మమకారం. అదే సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఏకకాలంలో సమయం వెచ్చి సమన్వయ పర్చడం సాధ్యం కాదని గులాబీ దళపతి గుర్తించారు. ఆ బాధ్యతను యువనాయకుడు కేటీఆర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించా రు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం జరిగిన వెంటనే క్షణాల్లో టీఆర్‌ఎస్ శ్రేణు లు తామే ఆ బాధ్యత చేపట్టినంత సంతోషంతో రోడ్ల మీదికొచ్చారు. దీపావళి పండుగ వచ్చినం త సంబురంతో పటాకులు పేల్చారు. మిఠాయి లు తినిపించుకున్నారు. యువకెరటం జోష్‌తో నయానాయత్వానికి స్వాగతించారు.

ప్రగతి కాముక విధాన రూపకల్పన..
సమకాలీక రాజకీయాలకు అనుగుణంగా కే టీఆర్ తన ప్రగతి కాముక విధానాలను రూపకల్పన చేస్తూ దేశంలోనే తెలంగాణకు ఒక గు ర్తింపు తీసుకువచ్చారు. ఐటీ, పట్టణాభివృద్ధి, ప రిశ్రమ శాఖలను నిర్వహించిన కేటీఆర్ ఐటీరం గంలో కొత్త విధానాలకు రూపకల్పన చేసి ఐటీ ఐకాన్‌గా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం తరువాత దేశ విదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలను రాష్ర్టానికి తీసుకురావడంలో ఆయ న టీపాస్ విధానానికి రూపకల్పన చేశారు. దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చే టీ పాస్ విధానంతో అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తెలంగాణవైపు పరుగులు తీశాయి. అనేక దేశాల్లో పర్యటించి తెలంగాణలో తమ కంపెనీలను తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీంతో అనేక కంపెనీలు తెలంగాణకు వచ్చాయి. బతుకుదెరువు కోసం తెలంగాణ ప్రజలు ఇతర రాష్ర్టాలకు వలసలు వెల్లిన వారిని మళ్లీ స్వరాష్ర్టానికి తీసుకురావాలన్న సంకల్పంతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇలా ఆయన రాజకీయ రంగంలోనే కాదు రాష్ట్ర ప్రగతిలో ఆయన కొత్త ఆలోచనలతో సరికొత్త విధానాలనురూపకల్పన చేయడంలో ఆయన సమర్ధతకు పదును పెట్టారు.

సమర్థ సారథ్యం ..
ఏ రంగంలోనైనా సమర్ధత చాటుకోవడంలో ఆయనకాయనే సాటి. రాజకీయ రంగంలో యువనేతగా సమర్ధనాయకత్వ లక్షణాలతో ముందుకు దూసుకుపోతున్నారు. రాజకీయంలో తలపండిన మహామహుల ఎత్తుగడలను చిత్తుచేసి టీఆర్‌ఎస్‌ను విజయతీరానికి చేర్చి తన సమర్ధతను నిరూపించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కేటీఆర్ తన సమర్ధతతో టీఆర్‌ఎస్‌కు 99 సీట్లను గెలిపించారు. ఆయన రాజకీయంలో వైవిద్యరీతిలో ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందే పసిగడ్డి చిత్తుచేసే సమర్ధత ఉన్న యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనే కాదు ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలలో ఆయన దాదాపు రాష్ట్రమంతా కలియతిరిగి విస్తృత ప్రచారం చేసి పార్టీని విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు లాంటి బడానేతలు రోడ్‌షోల్ చేసినప్పటికీ యువనేత కేటీఆర్ తనదైన రీతిలో రోడ్‌షోలు నిర్వహించి వారికి షాకిచ్చారు.
యువకుల్లో ఆయన ఒక ఐకాన్‌గా మారారు. వరంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలతో ఆయన టీఆర్‌ఎస్‌కు ఊపు తీసుకువచ్చారు. ఆయన సందర్భానుసారంగా అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ అనతికాలంలోనే సమర్ధనాయకుడిగా రాష్ట్ర చరిత్రలో గుర్తింపు పొందారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం రాజకీ య పార్టీగా మారిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మాణం చేసే అవకాశాలున్నాయి. కొత్త ఆలోచనలతో పార్టీని ముం దుకు తీసుకుపోయేందుకు ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. యువతను, పార్టీ పెద్దలను సమన్వయం చేసుకుంటూ పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవడంలో ఆయన సమర్ధతను మరోసారి నిరూపించుకోనున్నా రు. టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి దాకా నడిచిన తీరుకు విభిన్నం గా ఉండబోతున్నదన్న విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను ప్రకటించడంతోనే తేలిపోయింది. నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టపరిచే గురుతర బాధ్యతను యువసారధిపై వేశారు. రాష్ట్రస్థాయినుంచి మొదలుకొని జిల్లాస్థాయి, నియోజకవర్గస్థా యి, మండల, డివిజన్ స్థాయి దాకా సంపూర్ణ నిర్మాణం చే పట్టబోతున్నారు.

రాష్ట్రసాధన వరకు ఉద్యమ స్వరూపం, రాష్ట్రసాధన అనంతరం ఏర్పాటైన తొలి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసి ప్రధానంగా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మానవీయ కోణంలో పాలనాపరమైన బాధ్యతలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన చేసి ఆదర్శయ పాలన అం దించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనరంజక పాలన సాగించడం వల్ల రెండోసారి తిరిగి అజేయశక్తిగా టీఆర్‌ఎస్ ను ప్రజలు గుర్తించారు. ఆశీర్వదించారు. అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పద్ధతినే కొనసాగిస్తే తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ నిర్మాణం సైతం అ త్యంత ముఖ్యమని భావించారు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టపరచడం, కార్యకర్తలకు నాయకులకు శిక్షణనివ్వడంతోపాటు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మా ణం అనే కీలక, దీర్ఘకాలిక ఎజెండాతో ముందుకు సాగాలని పార్టీ అధినేత కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. పా ర్టీని నిర్మాణాత్మకంగా, గుణాత్మక అభివృద్ధి సాధనకు ప్ర భుత్వం జమిలీగా సాగేందుకు కేటీఆర్ వంటి యువ నాయకత్వంలో ముందుకు సాగబోతుందన్న విశ్వాసం పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నది.

యువకెరటంతో-నయాజోష్..
యువతకు ఐకాన్ అయిన కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం చేయడం యువతలో నయా జోష్ నింపింది. కొత్తతరం రాజకీయ నాయకులలో ఆయన దేశంలో నే మొదటిస్థానంలో నిలిచారంటే యువ నాయకుడిగా ఆయన కు ఎంత పేరుందో అర్థమవుతోంది. అన్నిరంగాల్లో పట్టున్న యువ నాయకుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియామకం కావడం పార్టీ యువ శ్రేణుల్లోనే కాకుండా తెలంగాణ యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. రాజకీయాలపై విముఖత చూపెడుతున్న నేటితరం యువతకు ప్రస్తుతం కేటీఆర్ ఐకాన్‌గా మారిన పరిస్థితి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెబుతున్న కేటీఆర్ పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టడంతో యువత సంతోషం వ్యక్తం చేస్తుంది.

242
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...