కంటి వెలుగు 60శాతం పూర్తి


Sat,December 15, 2018 03:38 AM

ఎల్కతుర్తి, డిసెంబర్ 14 : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కంటి వెలుగు ఇప్పటి వరకు 60శాతం పూర్తైందని ఎన్‌పీసీబీ (నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లయిండ్‌నెస్) జేడీ డాక్టర్ మోతీలాల్‌నాయక్ చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గోపాల్‌పూర్ పీహెచ్‌సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి కంటి పరీక్షలు చేశారు. అనంతరం మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ కోటి మంది వరకు కంటి పరీక్షలు పూర్తి చేశామన్నారు. అవసరం ఉన్న వారికి నాణ్యతో కూడిన అద్దాలను పంపిణీ చేస్తున్నామని, జనవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. అవసరమున్న వారికి శస్త్ర చికిత్సలు చేసి అద్దాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీఎంహెచ్‌వో మదన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకుబ్‌పాషా, కంటి వైద్యులు రవీందర్‌రెడ్డి, మల్లారెడ్డి, వైద్యాధికారి జీ శోభారాణి, సరోజ, ఎంపీటీసీ బోయినపల్లి లింగారావు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...