గొప్ప నిర్ణయం


Sat,December 15, 2018 03:38 AM

-టీఆర్‌ఎస్ పార్టీకి యువ నాయకత్వం
-సమర్థతగల నాయకుడిగా కేటీఆర్ నిరూపించుకున్నారు
-దేశంలోనే ఆదర్శపార్టీగా టీఆర్‌ఎస్ నవ నిర్మాణం
-ఓరుగల్లు ప్రజలది విలక్షణ తీర్పు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియామకంపై మాజీ ఉపముఖ్యమంత్రి కడియం
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్మ్రాక నిర్ణయం తీసుకున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. దేశంలో అతిచిన్న యవస్సులోనే అద్భుతాలు సృష్టించి తనను తాను నిరూపించుకున్న యువనాయకుడిని, భవిష్యత్ దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభపరిణామంగా ఆయన అన్నారు. కేవలం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడమే కాకుండా పార్టీకి అతిముఖ్యమైన నిర్మాణ బాధ్యతలు, క్రీయాశీల బాధ్యతలు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్‌గా కేటీఆర్‌ను నియమించగానే రాష్ట్రం వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అన్ని స్థాయిల శ్రేణులు సంబురాలు చేసుకుంటూ తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూన్నారు, స్వాగతిస్తున్నారు.

అంటే పార్టీలో, పార్టీ బయట కేటీఆర్‌కున్న నాయకత్వ లక్షణాలు, పరిణతి, సమర్థవంతైన, విలక్షణమైన వ్యక్తిత్వం ఉండడటమే కారణమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హన్మకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారని, కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకుగా కాకుండా ఒక క్రమశిక్షణగల కార్యకర్తగా, పట్టుదలతో తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి చూపారని ఆయన వివరించారు. హైదరాబాద్ వంటి మహానగరానికి విశ్వఖ్యాతి తీసుకురావడమే కాదు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధిశాఖలకు వన్నెతెచ్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలో మంత్రిగా కేటీఆర్ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు.

* ఒంటిచేత్తో నడిపించగల సత్తా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ఒంటిచేత్తో అన్నీ తానే అయి నడిపించారని, 2009 నుంచి 2018 దాకా పార్టీలో, ప్రభుత్వంలో తనకే బాధ్యత ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా, పరిణతిగల నాయకుడిగా వ్యవహరించారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను, ఎత్తుగడలను తిప్పికొట్టడంలో తనకు తానే సాటిగా కేటీఆర్ నిరూపించారని ఆయన వివరించారు. ఒకవైపు మంత్రిగా, మరోవైపు పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా అందరినీ ఏకతాటిపై నడిపించడంలో కేటీఆర్ విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో సీట్లు గెలవడంకాదు ప్రజల మనసులు సైతం గెలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన కార్యశీలురుగా ఎదిగారని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌తోపాటు దాదాపు 70 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు.

* క్రీయాశీల బాధ్యత
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి దఫాలో పూర్తిగా ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించారని, ఇప్పుడూ వాటిని మరింత ఉన్నంతంగా ఆచరిస్తూనే జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించబోతున్న నేపథ్యంలో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నిర్మాణం, నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం వంటి అతి ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించబోతున్నారని టీఆర్‌ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో దేశంలోనే మిగితా రాజకీయ పార్టీలకు దిక్చూచీగా మారుతాయన్న విశ్వాసం తనకుందని ఆయన పేర్కొన్నారు.

* ఓరుగల్లు విలక్షణ తీర్పునిచ్చిన ప్రతీ ఒక్కరికీ....
ఓరుగల్లు చైతన్యాన్ని ఈ మట్టికుండే పోరుగుణాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో చూపి విలక్షణమైన తీర్పు ఇచ్చి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిచిపించారని, అందుకు ఆయన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు చేసిన విజ్ఞప్తిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రౌడీలను, గూండాలను, భూ కబ్జాకోరులకు ఓటేయకూడని, రాజకీయాల్లో ఇటువంటి వారు ఉండకుండా ఓరుగల్లు మట్టిచైతన్యాన్ని ప్రదర్శించాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ ఈసారి అదృష్టవశాత్తు ఉమ్మడి జిల్లాలో ఎవరూ రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఎన్నికల కాలేదని ఆయన పేర్కొంటూ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా నాయకుడి గౌరవాన్ని, విశ్వాసాన్ని వమ్ముచేయకుండా ప్రజల కష్టసుఖాల్లో పాల్గొనాలని హితవు పలికారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...