బాధ్యతయుతంగా పని చేస్తా..


Sat,December 15, 2018 03:38 AM

-ప్రజల ఎజెండాతో ముందుకెళ్తా
-వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
నయీంనగర్, డిసెంబర్14: పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాధ్యతయుతంగా పని చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. రాంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆద రణతో బాధ్యత పెరిగిందని, 2009 నుంచి ఆదరించిన ప్రజల న మ్మకాన్ని వమ్ము చేయబోనని, అంకితభావంతో పని చేస్తానన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే 81,000 ఓట్లతో గెలిపించారని గుర్తుచేశారు. అమరావతి నుంచి దింపిన నోట్లతో ప్రజలను కొనాలని చూశారని, కానీ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారన్నారు. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఉం డడంతో మెజార్టీ తగ్గిందని, గుర్తు చేశారు. తన గెలుపునకు కృషి చే సిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నోటాకు 3,000 మంది ఓటు వేశారని, తనలో లోపాలు ఉంటే సరి చేసుకుంటానన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆంధ్రా తొత్తులుగా మారి విమర్శించారని, అది సరికాదన్నారు. వారు నగరాభివృద్ధికి సల హాలు ఇస్తే స్వీకరిస్తానన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బూత్‌స్థాయి వరకు పార్టీని పటిష్టం చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ దృ ష్టిసారిస్తున్న సమయంలో సరైనా నిర్ణయం తీసుకున్నారని చెప్పా రు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ అజీజ్‌ఖాన్, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, సుందర్‌రాజ్, నయీమొద్దీన్, జనార్దన్, కమురున్నీసాబేగం,పులి రజినికాంత్, పల్నాటి ప్రవీణ్, అనురామ్, బొర్ర ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

232
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...