మార్కెట్ కమిటీ అధికారులపై జేసీ ఆగ్రహం


Fri,December 14, 2018 02:00 AM

కాశీబుగ్గ, డిసెంబర్13: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల పై జాయింట్ కలెక్టర్, మార్కెట్ పర్సన్ ఇన్‌చార్జ్జి దయానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మార్కెట్‌ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డిమాండ్ సెక్షన్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్, తక్‌పట్టీలు, అకౌంట్స్, పన్నుల వసూళ్లకకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీలు చేయగా సక్రమంగా లేకపోవడంతో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల వసూలు చేసే విధానం అడగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినన చర్యలు తీసుకుంటామని, అధికారులు వెంటనే తమ పని విధానం మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారుల చెప్పిన లెక్కకు పుస్తకాలలో ఉన్న లెక్కలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. మార్కెట్ కార్యదర్శి సంగయ్య, గ్రేడ్-2 కార్యదర్శులు చింతపల్లి రామ్మెహన్‌రెడ్డి, పాల జగన్మోహన్‌ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సెక్షన్లల్లో పనులు అసంతృప్తిగా ఉన్నాయని వెంటనే సంబంధిత భాధ్యలు పర్యవేక్షించి సక్రమంగా పనులు చేపట్టాలని అదేశించారు.

పలు యార్డుల పర్యవేక్షణ
మార్కెట్ పరిధిలోని పల్లి, పసుపు యార్డును సందర్శించారు. అలాగే పత్తియార్డులో ఉన్న చిన్న గేటు నుంచి ముసలమ్మకుంటకు వెళ్లే రోడ్డు, అక్కడ నూతనంగా నిర్మించిన గోదాంలను పరిశీలించారు. అక్కడి నుంచి ఇందిరమ్మ ఇండ్ల మీదుగా మార్కెట్‌కు చేరుకున్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...