కేసీఆర్ ప్రమాణస్వీకారంతో సంబురాలు


Fri,December 14, 2018 02:00 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గురువా రం టీఆర్‌ఎస్వీ కేయూ విభాగం ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. కేయూ మొదటి గేట్ వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజ యం సాధించిన ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌కు మంత్రి పదవి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జెట్టి రాజేందర్, అర్బన్ కోఆర్డినేటర్ అరూరి రంజిత్, నాయకులు సుమన్, వీరు, విజయ్, ప్రభుదాస్, సూర్యం, సురేశ్, సు మన్, శ్రీహరి, పవన్, రాజు, రాజేశ్, రాహుల్ పాల్గొన్నారు.

7వ డివిజన్‌లో..
కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని గురువారం 7వ డివిజన్‌లోని ఉర్సు ఎస్సీకాలనీలో టీఆర్‌ఎస్ నాయకుడు ఈదుల రమేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘం చైర్మ న్ కేడల జనార్దన్ మాట్లాడుతూ తెలంగా ణ ప్రజల దీవెనతో టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెం డోసారి ప్రమాణస్వీకారం చేశారన్నారు. కార్యక్రమంలో కోట యాదగిరి, మామునూరు నాగరాజు, అన్వేశ్, ఆనంద్, స తీశ్, ఠాగూర్, జైసిల్, భిక్షపతి, దిలీప్, పూ ల, సునీత, లక్ష్మి, కుమార్, బాలు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...