సీఎం కేసీఆర్‌కు అభినందనల వెల్లువ


Fri,December 14, 2018 01:59 AM

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 13 : ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ను ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు గురువారం మర్యాద పూర్వకంగా కలిసారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నమస్తే తెలంగాణతో ఫోన్లో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్న ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ కార్యదక్షత వ ల్లే కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ నాయకులు
వరంగల్, నమస్తే తెలంగాణ/ఐనవోలు : కేసీఆర్‌ను ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్‌కు వచ్చిన మోజార్టీపై చర్చించారు. ఆయన వెంట బీరెల్లి భరత్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఎంపీపీ రవీందర్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు విమోచన సమితి రాష్ట్ర చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వరరావు, నాయకుడు బీరెల్లి భరత్‌కుమార్ రెడ్డి తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...