నాణ్యతా ప్రమాణాలు పాటించాలి


Thu,December 13, 2018 03:14 AM

-వరంగల్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం
-పనులు సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం
ఖిలావరంగల్, డిసెంబర్ 12 : వరంగల్ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే మండలం మేనేజర్ (డీఆర్‌ఎం) అమిత్ వర్ధాన్ సందర్శించారు. బుధవారం హౌరా ఎక్స్‌ప్రెస్ ద్వా రా వరంగల్‌కు చేరుకున్న ఆయన వరంగల్ రైల్వేస్టేషన్‌లో జరగుతున్న అభివృద్ధి పనులను అణువనువు పరిశీలించారు. ప్లాట్‌ఫాం పనులు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రైల్వేశాఖ మో డల్ రైల్వేస్టేషన్‌గా తీర్దిదిద్దేందుకు అభివృద్ధి పనులకు శ్రీ కారం చుడితే మీరు పనులను ఆలస్యం చేస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మండిపడ్డారు. పద్ధతి మా ర్చుకొని త్వరితగతిన పనులను నిబంధనలకు అనుకూలంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సాధార ణ ప్రయాణికుల విశ్రాంతి గదికి వెళ్లి తనిఖీ చేపట్టారు. గది మొత్తం సుందరంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేశా రు. పరిశుభ్రత ను ఇలానే కొనసాగించాలని సూచించారు. అనంతరం వరంగల్ రైల్వేస్టేషన్ బస్టాండ్ వైపు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీంతో ఆయన స్పందిస్తూ ఆటోస్టాండ్ కోసం డిజైన్ చేసిన మ్యాప్‌ను చూ శారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని పలు సూచనలు చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లో సుమారు రూ.23 కోట్లు నిధులతో జరగుతున్న ప్లాట్‌ఫాంలు, నూతన విశ్రాంతి గదులు, బేస్‌కిచన్, సైకిల్‌స్టాండ్, బుకింగ్ కౌంటర్ల పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగున్నర గంటలకు పైగా వరంగల్ రైల్వేస్టేషన్ తనిఖీ చేశారు. కాగా జెడ్‌ఆర్‌యూసీసీ, డీఆర్‌యూసీసీ సభ్యులు వంగాల సమ్మిరెడ్డి, చింతాలకు సునీల్, ఎరుకల రఘునారెడ్డి తదితరులు డీఆర్‌ఎం అమిత్ వర్ధాన్‌ను కలిసి వరంగల్ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుబ్రహ్మణ్యం, సీనియర్ డీసీఎం డాక్టర్ సుమిత్‌శర్మ, స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సీసీఐ రాజగోపాల్, హెచ్‌ఐ మీనా, ఆర్పీఎఫ్ సీఐ ఎం రవిబాబుతోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...