మన్యంలో మంచు దుప్పటి..!


Thu,December 13, 2018 03:14 AM

-ఏజెన్సీలో కురుస్తున్న పొగ మంచు..
-ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు
వాజేడు/కాళేశ్వరం : డిసెంబర్ రెండోవారంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, కాళేశ్వరం ఏజెన్సీ ప్రాంతాలు పొగ మంచు దుప్పటిని పర్చుకున్నాయి. తెల్లవారుజామునుంచే ఏజెన్సీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు ఉదయం 8గంటల వరకూ లైట్ల వెలుతురులోనే వాహనాలను నడపాల్సిన పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం పరిసరాలు, పవిత్ర త్రివేణి సంగమ గోదావరి తీరంలో మంచు దుప్పటి పర్చుకుని భక్తులకు కనువిందు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో రెండురోజులుగా కురుస్తున్న మంచుతో పర్యాటక ప్రాంతాలు మరింత అందాన్ని సంతరించుకుంటున్నాయి. దీంతో ప్రకృతి అందాలను తనివితీరా వీక్షించేందుకు పర్యాటకులు ఏజెన్సీ బాట పడుతున్నారు.

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం అభివృద్ధిదే అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందు జరుగనున్న ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అక్కడ మిగతా ఎమ్మెల్యేలతో కలిసి సందడి చేశారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...