నెరవేరనున్న ములుగు జిల్లా స్వప్నం!


Thu,December 13, 2018 03:14 AM

-కానుకగా ఇవ్వనున్న సీఎం కేసీఆర్
ములుగురూరల్/ములుగుటౌన్: ములుగును జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల స్వప్నం సాకారం కాబోతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్నది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయని, త్వరలో ములుగు, నారాయణపేట ఏర్పాటు కాబోతున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 30న ములుగులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చందూలాల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ములుగును జిల్లా చేసి కానుకగా అందిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, 11వ తేదీన విడుదలైన శాసన సభఎన్నికల ఫలితాల్లో చందూలాల్ ఓటమి పాలైనా ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ములుగును జిల్లా చేసేందుకు సుముఖంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో ఇది వరకే 31 జిల్లాలు ఉండగా నూతనంగా 32వ జిల్లాగా నారాయణపేట, 33వ జిల్లాగా ములుగు ఏర్పడనున్నాయి. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

360
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...