24 డీబీఎం వరకూ ఎస్సారెస్పీ నీళ్లు!


Thu,December 13, 2018 03:13 AM

-రెండు తడులకు అవకాశం
-ప్రాజెక్టులో నిల్వ 33.6 టీఎంసీలు మాత్రమే
-ఎల్‌ఎండీలో 7.5 టీఎంసీలు
-తాగునీటికి మినహాయించి పంటలకు..
-15వ తేదీన నిర్ణయించనున్న అధికారులు
వరంగల్ సబర్బన్, నమస్తేతెలంగాణ: రైతులు యాసంగి సీజన్లో పంటల సాగుకు నీటి విడుదల కోసం ఎదురు చూ స్తున్నారు. ఇప్పటికే వానకాలం వరికోతలు మొత్తం పూర్తయ్యాయి. తిరిగి నార్లు పోసేందుకు రైతులు సమాయాత్తమయ్యారు. నీటి లభ్యత ఉన్న రైతులు ఇప్పటికే నార్లు పోసి పొలాలు కూడా దున్నుతున్నారు. అయితే ఇప్పుడు నార్లు పోసిన చివరి వరకు నీళ్లు ఉంటయా...? అడుగంటి పోత యా...? అనే సందేహం అందరు రైతులను పట్టి పీడిస్తుం ది. ఈ తరుణంలో రైతుల్లో నెలకొన్న ఉత్కంఠను తొలగి స్తూ.. 24 డీబీఎం వరకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చే యాలని అధికారులు నిర్ణయించారు.

రెండు తడులకు మాత్రమే అవకాశం
ప్రస్తుతం ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కా గా, 33.6 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. దిగువన ఎల్‌ఎండీ పూర్తి కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రానున్నది ఎండాకా లం కావడంతో తప్పనిసరిగా తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఆవిరి వృథా పోను మిగిలిన నీళ్ల నే మాత్రమే వ్యవసాయ అవసరాలకు ఇవ్వడానికి వీలవుతుంది. వానా కాలం సీజన్లో కాలువ చరిత్రలో మొదటిసారిగా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు అయిన ఖమ్మం, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 284 కిలోమీటర్ వరకు నీటిని పంపించగలిగారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు ఆధారంగా పరిమిత ఆయకట్టుకు రెండు తడులను ఇచ్చేందుకు మాత్ర మే వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం నీటి విడుదలపై ఉన్నత స్థాయి సమావేశం జరుగాల్సి ఉం డగా, అది 15వ తేదీకి వాయిదా పడింది. ప్రాజెక్టు సీఈ తెలిపిన వివరాల ప్రకారం దిగువ ఎల్‌ఎండీ పరిధిలో జిల్లాలోని 24వ డిస్ట్రిబ్యూటరీ వరకు 15 రోజుల గడువులో రెం డు తడులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే నీటి విడుదల షెడ్యూల్ మాత్రం 15వ తేదీ సమావేశం తర్వాతనే నిర్ణ యం వెలువడనున్నది.

మెట్ట పంటలైతే మంచిది..
ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలా లు వేగంగా అడుగంటి పోతున్నాయి. వానాకాలం పంట పూర్తిస్థాయిలో రైతులకు అందివచ్చింది. గతంలో కాకతీ య కాలువ మరమ్మతులకు నోచుకోకపోవడంతో నిర్ణీత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి ఉండేది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించక పోవడంతో తవ్విన కాలువలు సైతం నిర్వహణ లేక నీటి సరఫ రా సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు రూ. 400 కోట్లతో కాలువ మరమ్మతు పనులను చేయిస్తున్నది. ఈ చర్యతో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతున్నది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి నీటి లభ్యత తక్కువ ఉండడం వల్ల ఆరుతడి పంటు వేసుకుంటే సులంభంగా గట్టెక్కే అవకాశమున్నదని అధికారులు సూచనలు చేస్తున్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...