జయహో తెలంగాణ


Wed,December 12, 2018 04:16 AM

భీమారం, డిసెంబర్11: వర్ధన్నపేట నియెజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పలు డివిజన్లలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 55, 57, 54వ డివిజన్లలో మంగళవారం నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. చింతగట్టులో 55వ డివిజన్ కార్పొరేటర్ కాయిత సరోత్తమ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు బిల్లా ఉదయ్‌కుమార్ రెడ్డి ల ఆధ్వర్ంయలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యకర్తలు, నాయకులు చింతగట్టు మునిపల్లి, భీమారంల్లో ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీల్లో జిల్లా నాయకులు ఏరుకొండ శ్రీనివాస్‌గౌడ్, పోలంపల్లి మల్లేశం, నద్దునూరి నాగరాజు, రాముచారి, సాగర్, ప్రసాద్, యువరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 57వ డివిజన్‌లోని పలివేల్పుల, ఎర్రగట్టుగుట్ట ప్రాంతాల్లో పార్టీ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, మిఠాయిలను పంపిణీ చేశారు.

ఈ సంబరాల్లో దేవరకొండ అనిల్‌కుమార్, శంకర్, చిర్ర వీరస్వామి, పులెంట్ల శ్రీధర్, తోట నాగరాజు, నంది శ్రీనివాస్, నాగరాజు యాదవ్, ఖాదర్‌బాబా, చంద్రశేఖర్, సాంబశివరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 54వ డివిజన్‌లో పార్టీ డివిజన్ కో-ఆర్డినేటర్ రుద్రోజు మణింద్రనాథ్ ఆధ్వర్యంలో వడ్డేపల్లి చర్చి జంక్షన్‌లో పటాకులు కాల్చి, ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ రాజునాయక్, ఎన్నికల ఇన్‌చార్జి గోకె కరుణాకర్ స్వీట్స్‌ను పంపిణీ చేసి, పటాకులు కాల్చారు. సంబురాల్లో నాయకులు మురళి, కృష్ణమూర్తి, నరేందర్, శివ, సురేశ్, రమేశ్‌నాయక్, శంకర్ నాయక్‌లు పాల్గొన్నారు. అలాగే మధుతండా, ఆర్టీసీ కాలనీ, నిరప్‌నగర్ తండాల్లో సంబురాలు నిర్వహించారు. 46వ డివిజన్ పరిధిలో వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ప్రాంతాలు ఉన్నాయి. ఆయా కాలనీల్లో, వాడల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్ ఆధ్వర్ంయలో చింతగట్టు మునిపల్లి, భీమారంల్లో ర్యాలీలను నిర్వహించారు. సంబురాల్లో జిల్లా నాయకులు లోకిని చందర్, దూలం చిన్న రాజుగౌడ్, పెద్దరాజుగౌడ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

38వ డివిజన్‌లో...
అర్బన్ కలెక్టరేట్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ గెలుపు సందర్భంగా 38 డివిజన్‌లో కార్యకర్తలు, ముఖ్య నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ పటాకులు పేల్చారు. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ వేడుకల్లో డివిజన్ పరిధిలో కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
రైల్వే కాలనీలో...
కాజీపేట: దాస్యం వినయ్‌భాస్కర్ గెలవడంతో కాజీపేట పట్టణం 36వ డివజన్‌లోని రైల్వే జంక్షన్ కాలనీలలో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ వేడుకల్లో సీనియర్ నాయకుడు సురేశ్‌బాబు, ఎస్‌ఆర్వీ రావు, అఫ్జల్, డీ వేణు, ప్రవీణ్, భాస్కర్, రాకేశ్, విజయ్, రమేశ్, అజమ్, బాబు, కుమార్, ప్రదీప్, దిలీప్, సజ్జు, రాజు, కిశోర్, కృష్ణ పాల్గొన్నారు.

286
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...