టీఆర్‌ఎస్ విజయఢంకాపై ఉద్యోగుల హర్షం


Wed,December 12, 2018 04:10 AM

అర్బన్ కలెక్టరేట్, డిసెంబర్ 11: వరంగల్ పాత కలెక్టరేట్ వద్ద టీఎన్‌జీవో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్, గెజిటెడ్ అధికారులు సంఘం ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ అన్నమనేని జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరై సంబరాలు జరుపుకుని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పెద్దఎత్తున నినాదాలు చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వానికి చేయూతనిస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అమరవీరులు ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్‌తో కలిసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనిస్తామన్నారు. సీపీఎస్ రద్దు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ తమతో కలిసి మమల్ని ఉద్యోమంలో ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ రెండవసారి ఘనం విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఉద్యోగులందరు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వేడుకలలో ఉద్యోగ సంఘాల నేతలు రత్నాకర్‌రెడ్డి, రాంకిషన్, పుల్లూరి వేణుగోపాల్, హసనొద్దిన్, రవి, కిషన్‌రావు, కిరణ్‌రెడ్డి, సోమయ్య, గాజె వేణుగోపాల్, మాధవరెడ్డి, భగవాన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...