కేసీఆర్ సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని ముందే చెప్పిన..


Wed,December 12, 2018 04:10 AM

-డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
రెడ్డికాలనీ, డిసెంబర్ 11 : తెలంగాణలో సీఎం కేసీఆర్ గాలి వీస్తోందని.. 11వ తేదీన వెల్లడయ్యే ఫలితాల సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని ముందే చెప్పినది నేడు అక్షర సత్యమైందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆ మాటలను నిజం చేసినందుకు తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ వాసులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, గెలిచిన అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ సాధ్యమని ప్రజలు నమ్మారని, ఈ ఫలితాలే రుజువు చేసిందన్నారు. వరంగల్ జిల్లాకున్న సమున్నత, చారిత్రక ఔన్నత్యాన్ని కాపాడాలంటే, ఈ జిల్లా గొప్పతనాన్ని ఇనుమడించాలంటే జిల్లాలోని రౌడీలను, గుండాలను, భూకబ్జాదారులను ఓడించాలని ఇచ్చిన పిలుపును అందుకుని మా వెంట కొండంత అండగా నిలబడిన వరంగల్ ప్రజానీకానికి హృదయపూర్వక వందనాలు తెలిపారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు ఇక్కడకు వస్తే తెలంగాణకు నష్టమని గ్రహించి, ఆంధ్రపక్షపాతి చంద్రబాబును భుజాల మీద మోసుకొస్తున్న బుద్ధిలేని, దద్దమ్మ కాంగ్రెస్ నేతలకు సరైన బుద్ధి చెప్పాలన్న నా మాట నమ్మి కేసీఆర్ వెన్నంటి నడిచిన వరంగల్ వాసుల ప్రజల తీర్పు చారిత్రాత్మకం. టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ప్రజలిచ్చిన తీర్పు మాపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టే విధంగా కష్టపడి పనిచేస్తామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటు పడతామన్నారు. వరంగల్‌ను హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, సహకారంతో సమిష్ఠిగా పనిచేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...