అంబరాన్నంటిన సంబురాలు


Wed,December 12, 2018 04:08 AM

-అమరుల స్తూపానికి నివాళులర్పించిన
-ఎమ్మెల్యేలు దాస్యం, అరూరి
సుబేదారి, డిసెంబర్ 11: వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు అంబారాన్నంటాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్‌భాస్కర్ గెలుపొందిన సందర్భంగా హన్మకొండలో పెద్ద ఎత్తున స్వీట్లు, కుంకుమలు, పటాకులతో సంబురాలు చేసుకోవడంతో నగరం గులాబీమాయమైనది. మంగళవారం ఏనుమాముల మార్కెట్‌యార్డ్‌లో జరిగిన ఓట్ల లెక్కింపులో పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్‌భాస్కర్ గెలుపు ఖారార్ కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కేరింతలతో కుంకుమలు చలుల్లకొని సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి వినయ్‌భాస్కర్ బయటకి రావడంతో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పుష్ఫగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత వినయ్‌భాస్కర్ కాన్వాయ్‌తో హన్మకొండకు బయలుదేరారు. ములుగురోడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మహాత్మజ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి ప్రత్యేక వాహనంపై వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన అరూ రి రమేశ్‌తో కలిసి ర్యాలీగా బయలుదేరి హన్మకొండ చౌరస్తా నుంచి, పబ్లిక్‌గార్డెన్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి చేరుకొని రాజ్యాంగ నిర్మాతకు వారిద్దరు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత నక్కలగుట్ట నుంచి అదాలత్ సెంటర్‌లోని ప్రజాకవి కాళోజీ విగ్రహానికి, బాలసముద్రంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం అదాలత్ అమరవీరుల జంక్షన్‌కు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి సుబేదారి, ఫారెస్ట్‌ఆఫీస్ జంక్షన్ నుచి వడ్డెపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ చౌరస్తానుంచి వడ్డెపల్లి వరకు దారిపొడవున టీఆర్‌ఎస్ వివిధ వర్గ ప్రజలు వినయ్‌భాస్కర్‌కు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రధాన కూడళ్లలో స్వీట్లు, పటాలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ ర్యాలీలో వినయ్‌భాస్కర్ వెంట కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతవిమోచన రుణ విముక్తి కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, విద్యాసాగర్, బోడ డిన్నా, రవీందర్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుందర్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...