పశ్చిమలో వినయ్ ప్రభంజనం


Wed,December 12, 2018 04:07 AM

-నాల్గోసారి విజయదుందుభి
-రౌండ్‌రౌండ్‌కు పెరిగిన మెజార్టీ
-19 మంది డిపాజిట్ల గల్లంతు
హన్మకొండ, నమస్తేతెలంగాణ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ రౌండ్ రౌం డ్‌కు ఆధిక్యతను ప్రదర్శించారు. తన సమీప టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొదటి రౌండ్ నుంచి 16వ రౌండ్ వరకు ప్రతి రౌండ్‌లోనూ మెజార్టీ కనబరిచారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
నాలుగోసారి గెలుపు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసిన దాస్యం వినయ్‌భాస్కర్ నాల్గోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సా ధించారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికలో, 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.
పోటీ ఇవ్వని ధర్మారావు
వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో పోటీ చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు డిపాజిట్ కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో 8449 ఓట్లను పొం దిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్ దక్కుతుంది. కాగా బీజేపీ అ భ్యర్థికి మాత్రం కేవలం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 5,979 ఓట్లుమాత్రమే పోల్ కావడంతో డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ 2014 ఎన్నికల్లో 18 వేల పైచిలుకు ఓట్లను సాధించింది. కానీ ఈసారి ధర్మారావు 16 రౌండ్‌లలో ఏ రౌండ్‌లో కూడా 500 ఓట్ల సంఖ్యను దాటలేదు. బీజేపీ తరఫున పలువురు కేంద్ర మం త్రులు, సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఆ యన డిపాజిట్‌ను కోల్పోవడం గమనార్హం.

19 మంది డిపాజిట్లు గల్లంతు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పోటీ చేసిన 21మంది అభ్యర్థుల్లో కేవలం విజయం సాధించిన దాస్యం వినయభాస్కర్‌తోపాటు ప్రత్యర్థిగా నిలిచి రెండవ స్థానం సాధించిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి మినహా ఎవరికీ డిపాజిట్లు దక్కకపోవడం విశేషం. 21 మంది అభ్యర్థుల్లో 19మంది డిపాజిట్ గల్లంతు అయింది. అదేవిధంగా పోటీ చేసిన 21మందిలో ఇద్దరికి కేవలం రెండంకెల ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. గోపు శ్రీనివాస్ 70, చిదురాల రాజన్న 89 ఓట్లను మాత్రమే సాధించారు.
భారీగా పోస్టల్ బ్యాలెట్లు
పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికలో పో స్టల్ బ్యాలెట్ల సంఖ్య భారీగా నమోదు అయింది. నియోజకవర్గం నుంచి 2293 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. కాగా పో స్టల్ బ్యాలెట్‌లో 34 బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి.
నోటాకు భారీగా ఓట్లు
నియోజకవర్గంలో నోటాకు 3075 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,40,830 ఓట్లు పోల్ కాగా అందులో 3075 ఓట్లు నోటాకు పడటం అభ్యర్థుల మెజార్టీని కొంతమేర తగ్గించింది.

325
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...