తూర్పులో నరేందర్ జయకేతనం


Wed,December 12, 2018 04:07 AM

-ప్రతీ రౌండ్‌లో కారు జోరు
-28,782 ఓట్ల మెజార్టీ
-బీజేపీకి డిపాజిట్ గల్లంతు
-ప్రభావం చూపని టీజేఎస్
వరంగల్, నమస్తేతెలంగాణ: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ జయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు ర విచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అ భ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభా వం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయ న మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అ భ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు. అయితే ట్ర క్కు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి కలిసివచ్చింది. కారు గు ర్తును పోలి ఉండటంతో ఆయనకు 2614ఓట్లు పడ్డాయి. నోటాకు భారీగానే 2572 ఓట్లు పడ్డాయి. అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ తన ఆధిపత్యాన్ని కనబర్చారు. నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, ఒద్దిరాజు రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కు సుమ సతీష్‌కు 4729 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అ భ్యర్థి నరేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్రపై 28,782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం
తూర్పు నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ తన ఆధిక్యతను చాటుకున్నారు. తొలి రౌండ్ నుంచే దూసుకుపోయారు. ఐదు, తొమ్మిది, పది, పదహారు రౌండ్‌లలో మాత్రం వెయ్యిలోపు ఆధిక్యత సాధించగా, నాలుగు, ఏడు, పదిహేను రౌండ్లలో వెయ్యికిపైగా ఆధిక్యతను సాధించారు. మిగతా అన్ని రౌండ్లలో రెండువేలకుపైగా ఆధిక్యతను సా ధించి తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ప్రతి రౌం డ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యతనే సాధిస్తుండడంతో నన్నపునేని నరేందర్ గెలుపు నల్లేరుపై నడకగా మారింది. రౌండ్ రౌం డ్‌కు టీఆర్‌ఎస్ మెజార్టీ పెరుగుతుండటంతో కాంగ్రెస్ ఏజెం ట్లు మధ్యలోనే వెళ్లి పోయారు.

డిపాజిట్ కోల్పోయిన కుసుమ సతీశ్
బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతయింది. ఏ రౌండ్‌లోనూ ప్రభావం కనిపించలేదు. పదహారు రౌండ్ల లెక్కింపులో కేవలం రెండు రౌండ్లలో మాత్రమే ఆయన 500 ఓట్లకుపైగా సాధించారు. మిగతా 14రౌండ్‌లలో 500 లోపే ఓట్లు సాధించడం గమనార్హం. తూర్పు నియోజకవర్గంలో పోలైన ఓట్లలో డిపాజిట్ రావడానికి 9800 ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ కేవలం 4,586 ఓట్లు మాత్రమే సాధించడం తో ఆయన డిపాజిట్‌ను కోల్పోయారు.
డీలాపడిన టీజేఎస్
తూర్పు నియోజకవర్గంలో టీజేఎస్ అభ్యర్థి గా దె ఇన్నారెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు నుంచే నియోజకవర్గంలో టీజేఎస్ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేసినప్పటికీ, ఆయనను ప్రజలు ఆదరించలేదు. చి వరి వరకు ప్రజాకూటమి పక్షాన టికెట్ తనకేనని భావించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో టీజేఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రచారం చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించలేదు. కనీ సం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇన్నారెడ్డికి కేవలం 1127 ఓట్లు మాత్రమే వచ్చాయి.
వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు
అధికారుల తప్పిదం వల్ల మూడు పోలింగ్ కేంద్రాలలోని ఈవీఎంలలోని వీవీప్యాట్ యం త్రాల స్లిప్‌ల ద్వారాయంత్రాల ఓట్లను లెక్కించారు. మాక్ పోలింగ్‌లో వేసిన 50 ఓట్లు ఎక్కువ గా రావడంతో అధికారులు వీవీప్యాట్ యంత్రాల స్లిప్‌లను లెక్కించారు. దీంతో 6 గంటల వరకు తూర్పు నియోజకవర్గ లెక్కింపు కొనసాగింది.

276
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...