ఆకట్టుకున్న దివ్యాంగుల


Tue,December 11, 2018 03:17 AM

-సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు
సుబేదారి, డిసెంబర్ 10: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా, ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనిరోస్ క్రిస్టియానా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ఎలాంటి సహాయం కావాలన్నా నేరుగా కలువొచ్చన్నారు. ఆధార్‌కార్డు, సదరన్ సర్టిఫికెట్లు కావల్సిన వారు తమను సంప్రదించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామానుజరావు, కేయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్, సీడబ్ల్యూసీ మాజీ చైర్‌పర్సన్ కే అనితారెడ్డి, అంపశయ్య నవీన్, ఎండీ సిరాజొద్దీన్, డాక్టర్ సుదీప్, కార్యక్రమ నిర్వాహకులు బండా రామలీల, సుచరితారెడ్డి, సుజాత, కోడం కళ్యాణ్, సీడబ్ల్యూసీ చైర్మన్ మండల పరుశరాములు, బన్ను మనోవికాస కేంద్రం, స్పందన మనో వికాస కేంద్రం, అతిథి మనోవికాస కేంద్రం, మల్లికాంబ మనోవికాస కేంద్రాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

392
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...