ఐసీఎస్‌ఎస్‌ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు రామేశ్వరం


Tue,December 11, 2018 03:16 AM

హన్మకొండ,నమస్తేతెలంగాణ డిసెంబర్ 10: కాకతీయ విశ్వ విద్యాలయం విశ్రాంతాచార్యులు గజ్జల రామేశ్వరం ఐసీఎస్‌ఎస్‌ఆర్ సీనియర్ రీసెర్చీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా ఎంపికైన 42 మంది రిటైర్డ్ అధ్యాపకులో రామేశ్వరం ఒకరు. రెండు సంవత్సరాల కాలానికి గాను అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వెల్ఫేర్ ఫర్మామెన్స్ ఫర్ ఏజ్డ్ పీపుల్ ఆఫ్ ఇండియా- ఇష్యూ అండ్ చాలెంజేస్ - ఎ కేస్ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫెలోసిప్‌కు విశ్రాంతాచార్యులను ఎంపిక చేస్తారు. రామేశ్వరం 2016లో ఉద్యోగ విరమణ చేశారు. రామేశ్వరం పర్యవేక్షణలో 12 మంది పీహెచ్‌డీ, 5గురు ఎంఫిల్ పూర్తి చేశారు. 6 పుస్తకాలకు ఎడిటర్‌గా పని చేశారు. గతంలో యూనివర్సిటీ పలు పాలనా పరమైన పదవులను చేపట్టి, విజయవతంగా నిర్వహించారు. మినిస్ట్రీస్ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ 11వ తేదీన అంతర్జాతీయ ప్రకృతి వైద్య దినోత్సం సందర్భంగా ఆచార్య రామేశ్వరాన్ని పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి వారు సన్మానించారు. రామేశ్వరం తన నివాసంలో ప్రకృతి వైద్య విధానంపై ఉన్న పుస్తకాలతో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామేశ్వరాన్ని కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్ సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అభినందించారు.

241
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...