కొనసాగుతున్న బీసీ ఓటర్ల గణన


Tue,December 11, 2018 03:15 AM

-15న తుది జాబితా వెల్లడి
అర్బన్ కలెక్టరేట్, డిసెంబర్ 10: గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 గ్రామ పంచాయతీల పరిధిలో బీసీ ఓటర్ల గణన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత మేలో వెల్లడించిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, సెప్టెంబర్‌లో వెల్లడించిన అసెంబ్లీ ఓటర్ల జాబితా, అక్టోబర్, నవంబర్ నెలల్లో విడుదల చేసిన సప్లిమెంటరీ ఓటర్ల జాబితాల ఆధారంగా అధికారులు ఈనెల 5వ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేసి బీసీ ఓటర్లను గుర్తించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బీసీ ఓటర్ల గణన చేపట్టినట్లు పీఆర్ అధికారులు తెలిపారు. అయితే ఇంటిం టి సర్వేలో భాగంగా బీసీ ఓటర్లను గుర్తించిన అధికారులు పంచాయతీరాజ్ కమిషన్ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 9వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాను అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 12వ తేదీలోగా పరిష్కరిస్తారు. అనంతరం 13,14 తేదీల్లో అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి ఆమోదం పొందుతారు. 15వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.

284
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...