విద్యా వలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


Tue,December 11, 2018 03:15 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ, డిసెంబర్ 10: వరంగల్ రూరల్ జిల్లాలోని పలు మండలాల్లో పాఠశాలలు మూసివేసిన, దీర్ఘకాలికంగా పాఠశాలలకు హాజరు కాకపోవటం వలన తరగతిలో వారి విద్యా ప్రమాణాల్లో వెనుకబడిన విద్యార్థులకు విద్యాబోధన చేయుటకు తాత్కాలిక ప్రాతిపదికన విద్యావలంటీర్ల నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్ పాఠశాల ఆర్జేడీ ఇన్‌చార్జి డీఈవో రాజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ వారు గుర్తించిన పాఠశాలల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయుటకు, వాటిలో విద్యావలీంటర్ల నియామకానికి టీటీసి/బీఈడీ అర్హత గల స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 18 వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందచేయాలని కోరారు.తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన కులం, నివాసం స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా స్థానికగత నిర్ణయించబడునని చెప్పారు. స్థానికులకు తాత్కాలిక ప్రాతిపదికన మూడు నెలల పాటు నియమించుట జరుగుతుందని తెలిపారు. నెలకు రూ. 7వేల గౌరవ వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ గుర్తించిన మండలాలలోని పాఠశాలలు దుగ్గొండి మండలంలో నాచినపెల్లి, దుగ్గొండి, తొగర్రాయి, గీసుగొండ మండలంలో ధర్మారం, ఖానాపూర్ మండలంలో బుధరావుపేట, నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, నందిగామా, నెక్కొండ మండలంలో నెక్కొండ, నర్సంపేట మండలంలో నర్సంపేట, మహేశ్వరం గురిజాలలో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. పర్వతగిరి మండలంలో అన్నారం, రాయపర్తి మండలంలో కొత్తూరు, రాయపర్తి, పెరికేడు, కొండూరు, సంగెం మండలంలో గవిచర్ల, శాయంపేట మండలంలో శాయంపేట పాఠశాలలో విద్యావలంటీర్లుగా 37 మందిని నియమించనున్నట్లు తెలిపారు.

284
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...