ఇదీ లెక్కింపు మార్పు కేసీఆర్ మార్క్..!


Mon,December 10, 2018 02:41 AM

-కొత్త జిల్లాకేంద్రాల్లోనూ కౌంటింగ్ కేంద్రాలు
-ఐదు నియోజకవర్గాలు మినహా ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే లెక్కింపు
-ఎక్కడెక్కడి నుంచో ఏనుమాములకు వచ్చే తిప్పలు మాయం
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ: వరంగల్ ఉమ్మడి జిల్లా ఐదు జిల్లాలుగా రూపాంతరం చెందినప్పటి నుంచి అనే క మార్పులు ఎన్నికల సందర్భంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వచ్చిన ఫలితం ఇది. అదే ముఖ్యమం త్రి కేసీఆర్ మార్క్. ఎన్నికల్లో గెలుపోటముల ప్రస్థావన అభ్యర్థులకు సహజమే. కానీ పాలనలో తెచ్చిన మా ర్పునకు ఇది ప్రత్యక్ష ఉదహరణ. ఎన్నికలు పూర్తివగానే అభ్యర్థులు, ఆ అభ్యర్థులకు సంబంధించిన ఏ జెంట్లు, ఆయా పార్టీల కార్యకర్తలు, కొంతమంది ప్రజల దృష్టి అంతా లెక్కింపు కేంద్రాలపై ఉం టుంది. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన నాయకులు, కార్యకర్తలు ఆ ప్రత్యక్ష దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు అభ్యర్థితో పైరవీలు చే యించి మరీ పలుకుబడి ఉన్నవాళ్లు లెక్కింపు ఏజెంట్లుగా వేయించుకుంటారు. ఏజెంట్లు కాకపోయినా సరే పార్టీల కా ర్యకర్తలు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోటెత్తాలని చూస్తారు. కౌంటింగ్ సరళిని చూసి అప్పటికప్పుడు దూర తీరాలను చెరిపేస్తూ కౌంటింగ్ కేం ద్రాలకు పోటెత్తే సందర్భాలు గత ఎన్నికల దాకా జరిగిన దృశ్యం.

స్వరాష్ట్రంలో స్వపాలన ఫలాలు గడపగడపకూ అందుతున్న నేపథ్యం వెనుక పరిపాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాల పునర్విభజన ఫలాలు రెండున్నరేళ్లుగా ప్రజల అనుభవంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల వరకు ఉన్న పరిస్థితికి, ఈ ఎన్నికల పరిస్థితికి మధ్య చెప్పుకునేంత చెరిపేసిన దూరం కొత్త దృశ్యం. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 ని యోజకవర్గాల ఓట్ల లెక్కింపు అంతా గత ఎన్నికల వరకు ఒక్కచోటే జరిగేది. స్థలాభావం వల్ల కొన్నిసార్లు ఉమ్మడి జిల్లాలోని కాకతీయ మెడిక ల్ కళాశాల, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, ఎల్‌బీ కాలేజీ, సీకే ఎం కాలేజీ, ఒకప్పటి ఆర్‌ఈసీ (ప్రస్తుత నిట్) ఇలా అనేక ప్రాంతాల్లో సందర్భానుసారం, సౌకర్యానుసారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పా ట్లు జరిగేవి. అయితే ఈసారి వినూత్నం. జిల్లా పునర్విభజన వల్ల వికేంద్రీకరణ ఫలితాలు ప్రజలకే కాదు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు, ఆయా పార్టీల కేడర్‌కు అందుబాటులో వచ్చిన సందర్భాన్ని ప్రత్యక్షంగా రేపు చూడబోతున్నాం. గతంలో లాగా ఓట్ల లెక్కింపు ఒక్కదగ్గరే కాదు. ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రంలోనే నిర్వహించబోతున్నారు.

ఉమ్మడి జిల్లా కేంద్రంలో తగ్గనున్న సందడి..
ఓట్ల లెక్కింపు సందర్భంగా 12 నియోజకవర్గాల నుంచి గతంలోలాగా ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్‌కు వచ్చే పరిస్థితి ఈసారి ఉండదు. అభ్యర్థులు కానీ, ఏజెంట్లు కానీ, మద్దతుదారులు కానీ ఎక్కడికక్కడ వి కేంద్రీకరించుకొని మోహరించబోతున్నారు. గత ఎన్నికల ఫలితాల రో జున్న వాతావరణం ఇక్కడ సందడి చేయదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కనుక, ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆయా జిల్లా కేంద్రాల్లోనే చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూ రల్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలు మినహా మిగతా ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆయా జిల్లా కేంద్రాల్లోనే నిర్వహించనున్నారు.

ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు..
జనగామ జిల్లా కేంద్రంలో మూడు నియోజకవర్గాలు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు నియోజకవర్గాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు నియోజకవర్గాల ఓట్లు లెక్కించను న్నారు. ఎన్నికల కమిషన్ మార్గద్శకాల ప్రకారం ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఏఎంసీలో రెండు జిల్లాల నియోజకవర్గాలు..
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఎప్పటి లాగే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎన్నికల రి టర్నింగ్ అధికారి పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాల లెక్కింపునకు కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
జనగామ జిల్లా: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రం పెంబర్తిలోని వీబీఐటీ, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రం మహబూబాబాద్‌లోని ఫాతిమా హైస్కూల్ ప్రాంగణం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి, ములుగు నియోజవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు.

555
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...