ఆధిక్యత ఆమెదే..


Mon,December 10, 2018 02:39 AM

-మూడు నియోజకవర్గాల్లో మహిళల పోలింగే అధికం
-జిల్లాలో 50.37శాతంగా నమోదు
-690 పోలింగ్ కేంద్రాల్లో కేవలం 250 బూత్‌ల్లో మాత్రమే పురుషుల అధిక్యం
-కొత్త ఓటర్లు ఎటువైపో..?
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:ఆమె ఆకాశంలో సగం మాత్రమే కాదు అవకాశాల్లోనూ సగంగా నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు కన్నా మహిళా ఓటర్లే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటలో 690 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 440 పోలింగ్ కేంద్రాల్లో మహిళల ఆధిక్యత కొనసాగింది. పురుష ఓటర్లు కేవలం 250 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వారి హవా చూపించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పురుష ఓటర్ల కంటే స్వల్ప ఆధిక్యంలోమహిళలు ముందం జలో ఉన్నారు. వరంగల్ పశ్చిమలో 50.23 శాతం మహి ళలు ఓటు హక్కును వినియోగించుకోగా వరంగల్ తూర్పు 50.71 శాతం పోలైన ఓట్లలో ఆధిక్యత నిలుపు కున్నారు. అదే విధంగా వర్ధన్నపేటలో పోలైన ఓట్లలో 50. 19 శాతంగా వారి పోలింగ్ జరిగింది. మహిళల ఓటింగ్ శాతం కొన్ని చోట్ల స్వల్పంగా, కొన్ని చోట్ల అధికంగా నమో దైంది. ఈ ఓటింగ్ శాతం తమకంటే తమకేనని బరిలో నిలిచిన అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో వారు ఎవరివైపు మొగ్గుచూపారనే విషయంపై ఆసక్తి నెలకొంది. కొత్తగా ఓటు హక్కువచ్చినవారు మూడు నియోజకవర్గాల్లో 16,074 ఉండగా వీరు ఎటువైపు ఉన్నారో ఆసక్తి నెలకొంది. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా చూస్తే దాదాపు ప్రతీ బూత్‌లో మహిళల ఆధిపత్యం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌లో మహిళలు భారీ సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా, అత్యధిక, అత్యల్ప పోలింగ్ బూత్‌ల్లో చూసినా మహిళల ఆధిక్యత శాతం కనిపించింది. మహిళా ఓటర్లు ఎవరి పట్ల మొగ్గు చూపుతారో వారే విజయం సాధిస్తారని అభిప్రాయం నెల కొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,755 మంది ఉంటే ఇందులో 1,04,958 మంది పురుషులు, 1,07,585 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 164 మంది ఉన్నారు. ఇందులో మొత్తం పోలైన ఓట్లు 1,54,285 . ఇందులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటేసిన పురుషులు 76,033 ఉంటే మహిళా ఓటర్లు 78,243 మంది ఉన్నారు. 164 మంది ఓటర్లుగా ఉన్న థర్డ్ జెండర్ ఓటేసింది మాత్రం కేవలం 9 మందే. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,40,880 ఓట్లు ఉంటే 1,40,405 ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ పురుషుల కంటే మహిళలే స్వల్ప ఆధిక్యతను చాటుకున్నారు. 69,874 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే 70,530 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,25,401 ఓట్లు ఉంటే ఇక్కడ మహిళలే అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 1,12,629 మంది పురుష ఓటర్లు ఉంటే 1,12,743 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,87,921 ఓట్లు పోలైతే 93,604 పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 94,317 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నియోజకవర్గాల వారీగా అత్యధిక, అత్యల్ప పోలింగ్ స్టేషన్లు
వరంగల్ తూర్పు అత్యధిక పోలింగ్ బూత్ 202. ఇక్కడ 917 ఓట్లు ఉండగా 796 పోలయ్యాయి (86.80 శాతం). పోలైన 796లో 410 మహిళా ఓటర్లు కావడం విశేషం. ఇక అత్యల్పంగా 134వ పోలింగ్ బూత్‌లో 1334 ఓట్లు ఉంటే అందులో కేవలం 695 (52.25 శాతం) మాత్రమే పోలయ్యాయి. ఇందులో 357 మంది మహిళలే కావడం విశేషం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 113 పోలింగ్ బూత్‌లో 634 ఓట్లు ఉండగా అందులో 537 ఓట్లు పోలయ్యాయి.(84.70 శాతం) అత్యల్పంగా 193వ పోలింగ్ బూత్‌లో 991 ఓట్లు ఉంటే ఇందులో కేవలం 326 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మాత్రం పోలైన ఓట్లలో అత్యధికంగా పురుష ఓటర్లు కావడం(187) విశేషం. వర్ధన్నపేట నియోజకవర్గంలో 2వ నంబర్ పోలింగ్ బూత్‌లో 94.24 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 955 ఓట్లు ఉండగా 900 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళలే(476) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా ఈ నియోజకవర్గంలో 77వ బూత్‌లో 46.43 శాతం అత్యల్పంగా నమోదైంది. ఇక్కడ 1234 ఓట్లు ఉంటే 573 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదీ మహిళా ఓటింగ్ సరళి..
వరంగల్ తూర్పులో మొత్తం ఓటర్లు 2,11,755. ఇం దులో పురుషులు 1,04,958, మహిళా ఓటర్లు 1,07, 585. ఇందులో 1,54,285 ఓట్లు పోలయ్యాయి. ఇందు లో 50.71 శాతం(78,243) మంది మహిళలు తమ ఓ టువినియోగించుకున్నారు. వరంగల్ పశ్చిమలో 2,40, 880 కాగా పోలైన ఓట్లు 1,40,405. ఇందులో 50. 23శాతం(70,530) మంది మహిళా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు. అదే వర్ధన్నపేటలో మొత్తం ఓట ర్లు 2,25,401 కాగా ఇందులో 1, 87,921 ఓట్లు పోలు కాగా ఇందులో 50.19 శాతం (94,317) మంది మహిళలు తమ ఓటు వినియోగించుకున్నారు. మొత్తంగా మూ డు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు కొంచం ఎక్కువ సమానత్వం ప్రదర్శించడం విశేషం.

ఐనవోలులోఅత్యధికం శాతం పోలింగ్ నమోదు
ఐనవోలు డిసెంబర్ 09: రాష్ట్ర శాసన సభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతంలో ఐనవోలు మండలం వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రథమ స్థానం నిలించింది. దీంతో అభ్యర్థుల మోజార్టీలో కీలక భూమిక పోషించనుంది. మండలంలో గ్రామాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, పోలింగ్ శాతం ఇలా ఉంది. వనమాల కనపర్తి మొత్తం ఓట్లు 1527. పోలైన ఓట్లు 1367. శాతం 89.52. కొండపర్తిలో మొత్తం ఓట్లు 2961, పోలైన ఓట్లు 2557, శాతం 86.35. నర్సింహులగూడెంలో మొత్తం 790, పోలైన ఓట్లు 668, శాతం 84.56. ముల్కలగూడెంలో మొత్తం ఓట్లు 1198, పోలైన ఓట్లు 1027, శాతం 86.30. సింగారంలో మొత్తం 1714, పోలైన ఓట్లు 1485, శాతం 86.63. ఐనవోలులో మొత్తం ఓట్లు 3776, పోలైన ఓట్లు 3370, శాతం 89.24. ఓంటిమామిడిపల్లిలో మొత్తం ఓట్లు 1811, పోలైన ఓట్లు 1614 శాతం 89.12. పున్నేల్‌లో మొత్తం ఓట్లు 2655, పోలైన ఓట్లు 2372, శాతం 89.34. పెరుమాండ్లగూడెంలో మొత్తం ఓట్లు 801, పోలైన ఓట్లు 762, శాతం 95.13. పంథినిలో మొత్తం ఓట్లు 2820, పోలైన ఓట్లు 2556, శాతం 90.63. కక్కిరాలపల్లిలో మొత్తం ఓట్లు 2014, పోలైన ఓట్లు 1833, శాతం 91.01. నందనంలో మొత్తం ఓట్లు 2566, పోలైన ఓట్లు 2173, శాతం 84.80. రాంనగర్‌లో మొత్తం ఓట్లు 725, పోలైన ఓట్లు 652, శాతం 89.93. ఉడుతగూడెంలో మొత్తం ఓట్లు 435, పోలైన ఓట్లు 404, శాతం 92.87. లింగమోరిగూడెం మొత్తం ఓట్లు 403, పోలైన ఓట్లు 378, శాతం 93.79. రెడ్డిపాలెంలో మొత్తం ఓట్లు 492, పోలైన ఓట్లు 366, శాతం 74.39. మండలం అత్యధికంగా పెరుమాండ్లగూడెంలో 95.13, అత్యల్పంగా రెడ్డిపాలెం 74.39 శాతం నమోదైంది. మండలం మొత్తం ఓట్లు 26,688, పోలైన ఓట్లు 23,587, శాతం 88.38గా నమోదైంది. అరూరికి భారీ మోజార్టీ చేకూర్చే క్రమంలో ఐనవోలు కీలక భూమిక పోశిస్తుందని టీఆర్‌ఎస్ శ్రేణులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

300
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...