కేంద్ర భద్రత బలగాల తిరుగు పయనం


Mon,December 10, 2018 02:39 AM

ఖిలావరంగల్, డిసెంబర్ 09: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేంద్ర భద్రత బలగాలు ఆదివారం ప్రత్యేక రైలులో స్వస్థలాలకు తిరిగి వెళ్లాయి. నవంబర్ 18న లక్నో చార్భాగ్ నుంచి విజయవాడకు వెళ్లే(రైలు నెంబరు 00183) రైలు ద్వారా నాలుగు కంపెనీల సశస్త్ర సీమ బల్, రెండు కంపెనీల సెంట్రల్ రిజర్వ్‌ర్డు పోలీస్ ఫోర్స్, నాలుగు కంపెనీల ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు వరంగల్‌కు చేరుకున్నారు. అలాగే నవంబర్ 22న ఢిల్లీ నుంచి ఖమ్మం వెళ్లే ప్రత్యేక రైలు (00195) ద్వారా ఆరు కంపెనీల ఐటీబీపీ బలగాలు వరంగల్‌కుకు చేరుకోగా మరో రెండు కంపెనీలు మహబూబాబాద్‌కు చేరుకున్నాయి. ఎన్నికల్లో కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలలో మనో ధైర్యాన్ని కల్పించేందుకు వరంగల్ పోలీసులతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లోని కవాతు నిర్వహించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించారు. విధులు పూర్తయిన తర్వాత ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ కంపెనీలకు చెందిన పలు భద్రత బలగాలు స్వస్థలాలకు వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. కేంద్ర బలగాల కోసం రైల్వే శాఖ కేటాయించిన ప్రత్యేక రైలు ద్వారా బయలుదేరి వెళ్లారు.

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్
ప్రయాణికులతో వరంగల్ రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో స్టేషన్ ప్రయాణికులతో సందడిగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్ రైల్వే, ఆర్పీఎఫ్ సీఐలు జూపల్లి వెంకటరత్నం, ఎం. రవిబాబు పర్యవేక్షణలో భారీ బందోబస్తును నిర్వహించారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ సలహాలు, సూచనలు చేశారు.

266
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...