పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి


Mon,December 10, 2018 02:38 AM

అర్బన్ కలెక్టరేట్ : పోస్టల్ బ్యాలెట్స్‌ను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సెక్యూరిటీ పర్సన్స్‌కు, పోలీస్ సిబ్బందికి, నిఘా బృందాలకు, నాల్గవ తరగతి ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను జారీ చేసినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పోస్టల్ బ్యాలెట్లను వరంగల్ ఆర్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్స్ నందు వేయాలని ఆయన తెలిపారు. తూర్పుకు చెందిన పోస్టల్ బ్యాలెట్లను మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో, వర్థన్నపేటకు సంబందించిన పోస్టల్ బ్యాలెట్లను వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని ఆయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఇచ్చిన ఫ్రొఫార్మాను సక్రమంగా పూర్తి చేసి సంతకం చేసి, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించి, బ్యాలెట్ పేపర్‌లో బాల్‌పెన్‌తో మార్కు చేసి ఆయా కవర్లతో ఉంచి బ్యా లెట్ బాక్స్‌లలో వేయాలన్నారు. ఆదివారం సమాచార పౌర సంబందాల శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు వరంగల్ ఆర్‌డీవో కార్యాలయంలోని పశ్చిమ నియోజక పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లో ఓటును వేశారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...