రిజర్వేషన్లు పొందినవారు సమాజ సేవ చేయాలి


Tue,November 20, 2018 05:58 AM

-సాంఘిక సంక్షేమశాఖ
-సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నిట్ క్యాంపస్, నవంబర్ 19 : రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు అని, అలా లబ్ధ్దిపొందిన వారు సమాజ సేవ చేయాలని తెలంగాణా సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిట్ అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో సోమవారం రిజర్వేషన్ పాలసీ, రోస్టర్ ఫార్ములేషన్‌పై ఐదు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హారైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు వ్యక్తుల ప్రాథమిక హక్కు అని చెప్పారు. ఎంతో ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన విధంగా రిజర్వేషన్లను ఉపయోగించుకుని సమాజానికి సేవ చేయాలని సూచించారు. రిజర్వేషన్ల అమలు జరిగి 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నామని అన్నారు. నిట్ డైరెక్టర్ ఎన్‌వీ రమణారావు మాట్లాడుతూ నిట్‌లో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. సదస్సు తీర్మానాలను ఎంహెచ్‌ఆర్‌డీకి పంపిస్తామని వివరించారు. ఎస్సీ,ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ ఆనందకిశోర్ మాట్లాడుతూ నిట్‌లో ఉద్యోగాలకు 15 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలన్నారు. ఈ ఐదు రోజుల వర్క్‌షాప్‌లో ప్రభుత్వ నియమాలు, రిజర్వేషన్లు, డీపీసీ, ఖాళీలు, రోస్టర్ విధానం, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై పలువురు నిపుణులు వివరించనున్నట్లు వర్క్‌షాప్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోవర్ధన్, డాక్టర్ బెనర్జీ, డీన్‌లు, నిట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...