తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పజెప్పొద్దు


Tue,November 20, 2018 05:57 AM

- రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు
- టీఆర్‌ఎస్ పశ్చిమ అభ్యర్థిదాస్యం వినయ్‌భాస్కర్
కాజీపేట, నవంబర్ 19: ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను మళ్లీ అంధ్రోళ్లకు అప్పజెప్పొద్దని టీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలోని 34,35, 52వ డివిజన్‌లోని బాలాజీనగర్, ఇంపిరీయల్ కాలనీ,బుడిద గడ్డ, భవానీనగర్,శాంతినగర్ తదితర కాలనీలలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలలోని మహిళలు వినయ్‌భాస్కర్‌కు మంగళహారతులు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం, తెలంగాణలో పెత్తనం కోసం సిద్ధ్దాంతాలను వదిలి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుందన్నారు. పశ్చిమకు మహాకూటమి అభ్యర్థిగా దిశ,దిక్కులు తెలియని రేపూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో ఉంటున్నాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోని రేపూరి ప్రకాశ్‌రెడ్డి అధికారం కోసం ప్రజల వద్దకు వస్తున్నాడని, ప్రజలు ఆయనకు ఓటమితో బుద్ధి చెప్పి టీఆర్‌ఎస్ బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జోరిక రమేశ్, బస్కే శ్రీలేఖ కృష్ణ, ఇన్‌చార్జ్జి దర్శన్ సింగ్, జనార్ధన్ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, శిరుమల్ల దశరథం, మైసారపు సిరిల్ లారెన్స్, మర్యాల కృష్ణ, దువ్వ కనుకరాజు, సంక నర్సింగ్, కొండ్ర శంకర్, బోల్లె కుమార్, సిలువేరు విజయ్‌కుమార్, తండమల్ల వేణు, దుప్పటి శివకుమా ర్, ఇమ్మడి రవి, బొట్టు రాజు, గోవర్ధన్, భిక్షపతి, మంద శ్రీనివాస్, మహేశ్, ఉ గ్గుల భద్రయ్య, మధు సూదన్, మల్లారెడ్డి, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...