ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.


Tue,November 20, 2018 05:57 AM

.
- టీఆర్‌ఎస్ వరంగల్ తూర్పు నియోజవర్గ అభ్యర్థి నన్నపనేని నరేందర్
- దేశాయిపేట్‌లో ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు
- గడప గడపనా నరేందర్‌కు ఘనస్వాగతం
- బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మహిళల స్వాగతం
కాశీబుగ్గ నవంబర్19: మీ మధ్య పెరిగిన వాడిని నన్ను ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని టీఆర్‌ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం దేశాయిపేట్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీరంగనాయక స్వామి దేవాలయంతో పాటు బొడ్రాయిల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రచారాన్ని ప్రారంభించారు. దేశాయిపేట్‌లోని 1, 12, 29, 15వ డివిజన్లల్లో ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి నిర్లక్ష్యం చేసిందన్నారు.తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానన్నారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమమన్నారు. తూర్పులో పోటీ చేస్తున్న వారు ఖమ్మం, ఘన్‌పూర్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారని, తాను నగరంలో పెరిగిన బిడ్డనని, పేద కుటుంబం నుంచి వచ్చిన తనను అశీర్వదించి గెలిపించాలని కోరారు. 29వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితాయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేశ్‌బాబు, నాయకులు డాక్టర్ హరి రమాదేవి, డాక్టర్ పోలా నటరాజ్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గుండేటి నరేంద్రకుమార్, కార్పొరేటర్లు రామ బాబురావు, యెలగం లీలావతి, కేడల పద్మ, వీర భిక్షపతి, కుందారపు రాజేందర్, దామోదర్‌యాదవ్, నాయకులు కావటి రాజుయాదవ్, సురేశ్‌జోషి, సామంతుల శ్రీనివాస్, తూర్పాటి సారయ్య, మావూరపు విజయభాస్కర్‌రెడ్డి, యెలగం సత్యనారాయణ, తత్తరి లక్ష్మణ్, బస్వరాజ్ కుమార్, బాసాని శ్రీనివాస్, బిల్లా శ్రీకాంత్, కొత్తూరి యాకెందర్, మధు పాల్గొన్నారు.

216
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...